బి.గోపాల్ పేరు చెప్తే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సినిమాలు గుర్తొస్తాయి.. అలాంటి ఆయన కృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజ శేఖర్ వంటి కథానాయకులకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయారు.. విచిత్రం ఏంటంటే యాంగ్రీ స్టార్ డా. రాజ శేఖర్‌తో చేసింది రెండు సినిమాలే అయినా రెండూ డిజాస్టర్స్ ఇచ్చారు.. వీరి కలయికలో వచ్చిన చిత్రాలు.. 1) గ్యాంగ్ మాస్టర్ (1994).. 2) రవన్న (2000).. 1999 సంక్రాంతికి బాలయ్యతో ‘సమర సింహా రెడ్డి’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత భారీ అంచనాలతో వచ్చింది ‘రవన్న’..
ఫస్ట్ ఫిలిం.. ‘గ్యాంగ్ మాస్టర్’..
యాంగ్రీ స్టార్. డా.రాజ శేఖర్, నగ్మా నాయకా నాయికలుగా.. స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన ఫిలిం ‘గ్యాంగ్ మాస్టర్’.. ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతమందించారనే విషయం చాలా మందికి తెలియదు.. ఇక ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడేదేముంది?.. సాంగ్స్ అలరించాయి.. కానీ సినిమానే డిజాస్టర్ అయ్యింది.. కథ జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు..
సెకండ్ సినిమా.. ‘రవన్న’..
సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమైన పాత్రలో.. రాజ శేేఖర్, సౌందర్య హీరో హీరోయిన్లుగా.. సంఘవి, రక్ష, జయ ప్రకాష్ రెడ్డి, నర్రా తదితరులు ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘రవన్న’.. మాగంటి గోపినాథ్ నిర్మాత.. పోసాని కృష్ణ మురళి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.. ఎస్.ఎ.రాజ్ కుమార్ సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి కానీ సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం.. ‘రవన్నా.. ఇదేం సినిమా అన్నా’ అంటూ వాపోయారు.. కేవలం కథ బాగోలేకపోవడం వల్ల కృష్ణ, రాజ శేఖర్, బి.గోపాల్‌ల క్రేజీ కాంబినేషన్ వృథా అయ్యింది.. అలా ఈ రెండు సినిమాలతోనూ గోపాల్.. రాజ శేఖర్‌కి హిట్ ఇవ్వలేకపోయారు.. తర్వాత ‘వంశీ’, తర్వాత ‘నరసింహ నాయుడు’తో ఇండస్ట్రీ హిట్.. ‘అల్లరి రాముడు’ తర్వాత ‘ఇంద్ర’తో బ్లాక్ బస్టర్ కొట్టారు బి. గోపాల్..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?