Guna Sekhar: ఎన్టీఆర్ గురించి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర కామెంట్స్ వైరల్.!
- March 29, 2023 / 03:48 PM ISTByFilmy Focus
జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అతను కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా కొమరం భీముడో పాటలో అతను కనబరిచిన హావభావాలు.. విదేశీ ప్రేక్షకులతో కూడా చప్పట్లు కొట్టించాయని చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ పాత్ర గురించి మరో 25 ఏళ్ళ వరకు చెప్పుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం చేసింది గుణశేఖర్ దర్శకత్వంలో అన్న సంగతి తెలిసిందే.
‘బాల రామాయణం’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు ఎన్టీఆర్. ఆ చిత్రంలో అతను చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీరాముడి పాత్రను పోషించాడు. అయితే ఎన్టీఆర్ గురించి తాజాగా ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. గుణశేఖర్ మాట్లాడుతూ… “ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడని ఇప్పుడు అంతా అంటున్నారు. కానీ అతన్ని ఇప్పుడు మీరు చూసినట్టు నేను ‘బాల రామాయణం’ సినిమా షూటింగ్ టైంలోనే చూశాను.

ఎన్టీఆర్ చాలా హైపర్ యాక్టివ్. చాలా వండర్ కిడ్ లా ఉండేవాడు. ‘రామాయణం’ సినిమా షూటింగ్ కు ముందు 3 నెలలు వర్క్ షాప్ పెట్టాం. సమ్మర్ టైంలో వాళ్లకు సెలవులు ఉంటాయి కాబట్టి.. ఆ టైంలో వర్క్ షాప్ ను నిర్వహించాం. ఆ వర్క్ షాప్ టైంలోనే ఎన్టీఆర్ ను నేను గమనించాను. నిజానికి గమనించాల్సిన అవసరం లేదు. అతనే కనిపిస్తాడు. అతను జనాల్లో ఉన్నా ‘ఔట్ స్టాండింగ్ ఇన్ ది క్రౌడ్ లా ఉంటాడు. పైగా అతను క్లాసికల్ డాన్స్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాడు.

అద్భుతమైన కూచిపూడి డాన్సర్ తను. అందుకే నాకు (Guna Sekhar) ఎలాంటి పెర్ఫార్మన్స్ కావాలంటే అది ఇచ్చేసేవాడు. అప్పుడే అనుకున్నాను.. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని” అంటూ చెప్పుకొచ్చాడు. గుణశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులను ఖుషి చేయిస్తున్నాయని చెప్పాలి. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :
Director Gunasekhar Excellent words about NTR ❤.
నా బాల రాముడు.. ఇప్పుడు లోకా భీరాముడు.@tarak9999 #ManOfMassesNTR#GlobalStarNTR pic.twitter.com/GVfJnXKTmu— Nandamuri universe (@nandamuriuniver) March 27, 2023
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?
















