పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నాడు క్రిష్. నిజానికి అంతకు క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఆ టైములో ఆయనకి తదుపరి సినిమాకి ఏ హీరో అవకాశం ఇవ్వడం ఈజీ కాదు అని అంతా విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు. దానిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. అది విడుదలయ్యే లోపే ఇంకో పెద్ద అవకాశం కొట్టేయాలి.
కానీ క్రిష్ మధ్యలో కాస్త అత్యాశకి పోయాడు అనిపిస్తుంది. లాక్ డౌన్ టైములో అతని చదివిన పుస్తకం ఆధారంగా ‘కొండపొలం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అంతేకాకుండా ‘హరిహర వీరమల్లు’ సినిమా పై పవన్ ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది. పోనీ రిజల్ట్ ను పక్కన పెట్టి ‘కొండపొలం’ లో గొప్ప అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే అదీ లేదు. సరిగ్గా క్రిష్ బాటలోనే మారుతీ కూడా నటించాడు. గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న టైములో కాస్త గ్యాప్ వస్తే ‘మంచి రోజులొచ్చాయి’ అనే చిన్న సినిమాని తెరకెక్కించాడు.
నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ అయితే తెగ చేస్తున్నారు కానీ విడుదల చేసిన ప్రోమోలు, ట్రైలర్లు అంత ఆసక్తిని రేకెత్తించడం లేదు. ఈ సినిమా ఫలితం తేడా కొడితే.. హీరో గోపీచంద్ పరిస్థితి ఏంటి? అసలే అతను ఈ మధ్యనే ‘సీటీమార్’ తో హిట్టు కొట్టి… ఫామ్లోకి వచ్చాడు. ఒకవేళ ‘మంచి రోజులొచ్చాయి’ కనుక హిట్ అయితే గోపీచంద్ సినిమాకి ప్లస్ అవ్వడమే కాకుండా.. ఇంకా చాల మంది దర్శకులు వీరి బాటలో చిన్న సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంటుంది. అది టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మంచిదే..!