Parasuram: ‘సర్కారు వారి పాట’ మైనస్ ల పై స్పందించిన దర్శకుడు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదలైంది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అదేంటో కానీ ఓవర్సీస్ లో ఇంకా షోలు పడకముందే ‘#DisasterSVP’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే… బాక్సాఫీస్ వద్ద అయితే ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. అయితే సినిమా చూసిన తర్వాత ఈ మూవీలో కొన్ని మైనస్ లు ఉన్నాయంటూ విమర్శకులు ఏకి పారేశారు.

తర్వాత సోషల్ మీడియాలో కూడా వీటి పై కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ జరిపారు. తాజాగా ఆ మైనస్ ల పై పరశురామ్ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులు అప్పుల బాధ తట్టుకోలేక చనిపోతారు. అలాంటప్పుడు హీరో అప్పుకి వ్యతిరేకంగా ఉండాలి కానీ విదేశాల్లో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు అని కొందరు విమర్శించారు. దీనికి పరశురామ్ బదులిస్తూ.. ‘చిన్నప్పుడు తండ్రి హీరోకి ఓ మాట చెబుతాడు. ఏ అప్పు చేయకుండా ఉండేవాడు స్ట్రాంగ్, ఆ అప్పుని తిరిగి వసూల్ చేసుకునేవాడు ఇంకా స్ట్రాంగ్ అని’.. కాబట్టి దానిని హీరో ఫాలో అవుతాడు.

అలాగే హీరోయిన్ కు హీరో మొదట 10 వేల డాలర్లు ఇస్తాడు. తర్వాత ఇంకో 25 వేల డాలర్లు ఇస్తాడు. అంతేకాకుండా హీరోని మభ్యపెట్టి హీరోయిన్ ఇంకా డబ్బులు కొట్టేస్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఇండియాకి వచ్చి 10 వేల డాలర్లు మాత్రమే అడుగుతాడు…. హీరోకి లెక్కలు రావా అని కొందరు విమర్శించారు. దీనికి పరశురామ్ బదులిస్తూ.. ‘ హీరో 10 వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు, తర్వాత ప్రేమతో ఇస్తాడు, ప్రేమలో ఉన్నప్పుడు హీరోయిన్ డబ్బులు తీసుకుంటుంటే పెళ్ళాం జేబులోంచి డబ్బులు తీసుకున్నట్లు భావిస్తాడు. ఆ ప్రేమ విఫలమైంది అని తెలిసాక కేవలం అప్పుగా ఇచ్చిన 10 వేల డాలర్లనే అడుగుతాడు అంటూ పరశురామ్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా హీరో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు టైంకి ఎవరైనా వడ్డీ కట్టకపోతే తన్ని,తరిమి,ముక్కు పిండి మరీ వసూల్ చేస్తుంటాడు. కానీ ఇండియాకి వచ్చినప్పుడు రికవరీ ఏజెంట్లను తన్ని మధ్యతరగతి కుటుంబాలను రెచ్చగొడతాడు… అంటూ కొంతమంది విమర్శించారు. దీనికి పరశురామ్ బదులిస్తూ.. ‘రికవరీ ఏజెంట్లను ఈ.ఎం.ఐ లు వసూల్ చేయొద్దు అని హీరో చెప్పడు. వీళ్ళు ఈ.ఎం.ఐ లు కట్టడానికి నైట్ జాబ్ లు కూడా చేసి కడుతున్నారు.వాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వండి. ముందు పెద్ద పెద్ద లోన్లు ఎగ్గొడుతున్న పెద్ద వాళ్ళ దగ్గర వసూల్ చేసి రండి అని హీరో రికవరీ ఏజెంట్లకి చెబుతాడు’ అంటూ పరశురామ్ చెప్పుకొచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus