‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమా నిన్న అంటే ఏప్రిల్ 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి (Vijaya Shanthi) కీలక పాత్ర పోషించింది. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. తల్లీ కొడుకుల ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ పై కూడా అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో వాళ్లకు నచ్చే టెంప్లేట్ సినిమా రాలేదు. పైగా చివరి 20 నిమిషాల్లో ఓ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. కళ్యాణ్ రామ్ వంటి హీరో ఇమేజ్ కి ఇంత బరువైన యాక్షన్ సినిమా అవసరమా అనుకునే వారికి ఈ క్లైమాక్స్ తో ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. అయితే సినిమాలో ఈ క్లైమాక్స్ తప్ప.. కొత్తగా ట్రై చేసింది ఏమీ లేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరిని (Pradeep Chilukuri) అంతా అభినందిస్తుంది ఈ క్లైమాక్స్ కోసమే.
కానీ అది అతనికి దక్కాల్సిన క్రెడిట్ కాదు అని ఈరోజు జరిగిన సక్సెస్ మీట్లో కళ్యాణ్ రామ్ చెప్పడం అతనితో పాటు అందరికీ షాకిచ్చింది. వాస్తవానికి ఆ క్లైమాక్స్ ను డిజైన్ చేసింది రైటర్ శ్రీకాంత్ విస్సా అట. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ కథని కళ్యాణ్ రామ్ చాలా సార్లు రిజెక్ట్ చేస్తూ వచ్చాడట.
తప్పులేదు కథగా చెప్పుకుంటే ఇందులో కొత్త పాయింట్ ఏమీ కనిపించదు. క్లైమాక్స్ వరకు ఫైట్ సీక్వెన్సులే ఎక్కువ ఉంటాయి. కానీ క్లైమాక్స్ వల్ల తల్లి ఎపిసోడ్ కి.. న్యాయం జరుగుతుంది. సో ఫైట్స్ ఎలాగూ స్టంట్ కొరియోగ్రాఫర్స్ క్రెడిట్. క్లైమాక్స్ పోర్షన్ రైటర్ క్రెడిట్ అన్నప్పుడు… దర్శకుడు ప్రదీప్ చేసింది ఏమున్నట్టు..!?
ఎన్నో వెర్షన్లు రిజెక్ట్ చేశాక.. శ్రీకాంత్ విస్సా చెప్పిన క్లైమాక్స్ చాలా నచ్చింది
ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటివరకు మన ఇండస్ట్రీలో రాలేదు#ArjunSonOfVyjayanthi #KalyanRam #Vijayashanthi #SaieeManjrekar #PradeepChilukuri pic.twitter.com/ykB7oU1Fjd— Filmy Focus (@FilmyFocus) April 19, 2025
ఎన్నో వెర్షన్లు రిజెక్ట్ చేశాక.. శ్రీకాంత్ విస్సా చెప్పిన క్లైమాక్స్ చాలా నచ్చింది
ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటివరకు మన ఇండస్ట్రీలో రాలేదు#ArjunSonOfVyjayanthi #KalyanRam #Vijayashanthi #SaieeManjrekar #PradeepChilukuri pic.twitter.com/ykB7oU1Fjd— Filmy Focus (@FilmyFocus) April 19, 2025