Puri Jagannadh, Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎమోషనల్ కామెంట్స్..!

కలలో కూడా అనుకోలేదు ఇలా సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో.. మాయమైపోతాడు అని..! మన టాలీవుడ్ ప్రేక్షకులకే ఇలా ఉందంటే.. శాండల్ వుడ్ ప్రేక్షకులకు ఇంకెంత కష్టంగా ఉండుంటుందో..! ‘పునీత్ రాజ్ కుమార్ ఎందుకయ్యా.. ఇలా చేసావ్’ అంటూ గుండెలు బాదుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు అతను ఎవ్వరూ ఊహించని విధంగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అతన్ని హీరోగా పరిచయం చేసిన మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ వార్త విని చాలా ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఆయన శైలిలో భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. పూరి మాట్లాడుతూ :

” మీరు కన్నడలో మంచి హీరో..సూపర్ స్టార్ అని తెలుసు…మీ గురించి అంతకు మించి నాకు తెలీదు..
కానీ ఈ రోజు తెలుసుకున్నాను..
22 అనాధశ్రమాలు..
32 గ్రామాలు దత్తత..
18 గోశాలలు..
వేలమందిని చదివిస్తున్నారని…
ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి భోజనం…
ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపే నిజమైన హీరో..
అందరూ హీరోలు కావాలని అనుకుంటారు
వాళ్ళు చేసే మంచి పనులు వల్లే నిజమైన హీరోలుగా
ప్రజల మనస్సులో ఎప్పటికీ సజీవంగా ఉంటారు..

ఇలాంటి మనసున్న మహారాజుని కోల్పోవడం నిజంగా అందరికీ తీరని లోటు…కానీ మరీ ఇంత చిన్న వయసులో 46 ఏళ్లకే చనిపోవటం మాత్రం చాలా బాదాకరం బాధాకరం సార్….

డబ్బు, హోదా, పలుకుబడి ఎన్ని ఉన్నా చావు అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.. చావు వచ్చాకా తప్పించుకోలేము..

మనకి దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి…ప్రతి నిమిషం ఎంజాయ్ చేయండి..

పుట్టుకతో ఏమి తీసుకురాము.. వట్టి చేతులతో వస్తాం.. పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాం..

ఈ నిజాన్ని చాలా మంది గ్రహించలేక కూర్చొని తిన్నా, తరతరాలు బతకడానికి సరిపోయేంత ఉన్నా కూడా ఇంకా ఇంకా సంపాదించాలి అనే అత్యాశతో కొంతమంది అవినీతి చెస్తే, మరి కొంతమది లేనిపోని దుర్మార్గపు పనులు అన్ని చేస్తుంటారు.. ఎందుకు అలాంటి డబ్బు?? చివరకు మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా, లక్షల కోట్లు ఉన్నా పోయే సమయం వచ్చింది అంటే ఎవరు ఆపలేరు..

మిస్ యు పునీత్ రాజ్ కుమార్ గారు 🙏🙏🙏

యు విల్ ఆల్వేస్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ …. ఆల్వేస్ ఫరెవర్ రెస్ట్ ఇన్ పీస్ 💔 ” అంటూ చెప్పుకొచ్చాడు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus