గతేడాది జులై నెలలో విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వాయిదా పడింది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో రాజమౌళి అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటన చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల దాదాపు రెండున్నర నెలలు షూటింగ్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది రిలీజ్ కాదని వచ్చే ఏడాది జనవరి లేదా సమ్మర్ కు ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన పోస్టర్ ద్వారా 2021 అక్టోబర్ 13వ తేదీనే ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేస్తామని రాజమౌళి స్పష్టతనిచ్చారు. చరణ్, తారక్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి దసరాకే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారని ఆ తేదీకి సినిమా విడుదల కాదని వార్తలు వచ్చాయి.
అయితే నేడు కీరవాణి పుట్టినరోజు కాగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ కీరవాణి ఫోటోతో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కూడా అక్టోబర్ 13వ తేదీనే సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ పేర్కొన్నారు. రాజమౌళి సినిమాను అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని రిలీజ్ డేట్ మారదని రాజమౌళి కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం. అక్టోబర్ 13వ తేదీ నాటికి ఆర్ఆర్ఆర్ రిలీజై సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారితే తమ సినిమాలను దసరాకు రిలీజ్ చేద్దామని పలువురు దర్శకనిర్మాతలు భావించగా రాజమౌళి రిలీజ్ డేట్ గురించి స్పష్టతనిచ్చి వారికి కూడా షాకిచ్చారనే చెప్పాలి.
Wishing our Musical genius @MMKeeravaani garu, a very Happy Birthday. Can’t wait for the world to groove to the music of #RRRMovie very soon!!! 😉
DHARA DHAM DHARA
DHAM DHARA DHAM DHAM.. 🔥🌊 pic.twitter.com/V7ZI6k6yBf— RRR Movie (@RRRMovie) July 4, 2021
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!