దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల కురిపించడమే కాకుండా ఈ సినిమాని ఆస్కార్ బరిలో ఎంపిక చేశారు.
ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా మూడు విభాగాలలో ఆస్కార్ నామినేషన్ లో సెలెక్ట్ అయింది.అలాగే ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు కూడా ఆస్కార్ బరిలో ఉండడంతో ఈ సినిమాకు తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే ఎలా ఉంటుందో అనే విషయంపై రాజమౌళి స్పందించారు.
ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కనుక వస్తే రాజమౌళి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన ఈయన తన సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పటికీ తన తదుపరి సినిమాల వ్యూహాలు ఏమాత్రం మారవని తాను ఇతర భాష చిత్రాలు చేయనంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక మా సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే కేవలం మా సినిమా టీమ్ కి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేకర్స్ కు బూస్ట్ ఇస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమాకు మంచి గుర్తింపు రావడం అనేది ఆ సినిమాలో చేసిన ప్రతి ఒక్క నటీనటులకు సాంకేతిక బృందానికి ఇచ్చే గౌరవమని ఈ సందర్భంగా ఈయన ఆస్కార్ అవార్డుపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.