Ravi Teja: రవితేజ సినిమా స్టోరీపై డైరెక్టర్ క్లారిటీ!

  • June 7, 2021 / 03:55 PM IST

‘రాక్షసుడు’ సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నాడు రమేష్ వర్మ. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘ఖిలాడి’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాదని.. తను చేయాలనుకున్న సినిమా వేరే ఉందని చెప్పుకొచ్చాడు. ‘రాక్షసుడు’ సినిమా తరువాత ఓ మంచి లవ్ స్టోరీ తీయాలనుకున్నాడట రమేష్ వర్మ. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్ల మధ్య నడిచే కథట. దీని గురించి హీరో నితిన్ తో చర్చించినట్లు చెప్పారు.

కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని.. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు తీయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఖిలాడి’ సినిమా రీమేక్ అంటూ వస్తోన్న వార్తలపై కూడా స్పందించాడు ఈ డైరెక్టర్. నిజానికి ఇది రీమేక్ కాదని.. కానీ ఓ తమిళ సినిమాకు దగ్గర ఉంటుందని చెప్పాడు. ముఖ్యంగా ఆ తమిళ సినిమా ఇంటర్వెల్ కు. ‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ కు దగ్గర పోలిక ఉంటుందని చెప్పాడు. దీనికి సంబంధించి ఆ తమిళ సినిమా నిర్మాతతో మాట్లాడానని..

అది తప్పితే మిగిలిన స్టోరీ అంతా ఫ్రెష్ గా ఉంటుందని చెప్పాడు. తమిళ సినిమాకి ‘ఖిలాడి’కు పోలికలు ఉంటాయని చెబుతూనే రీమేక్ మాత్రం కాదని అంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ తరువాత కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus