Sekhar Kammula: ప్రభాస్ మాదిరి ఏ హీరో చేయలేరు!: శేఖర్ కమ్ముల

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన సినిమాలు ఎంతో అద్భుతంగా ఆదరణ పొందటమే కాకుండా ఎప్పటికీ ప్రేక్షకులకు ఫీల్ గుడ్ సినిమాలుగానే ఉంటాయని చెప్పాలి. ఇలా శేఖర్ కమ్ముల తన సినిమాలన్నింటిని కూడా సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ఇక ఈయన చివరిగా లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈయన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శేఖర్ కమ్ముల టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి పలు విషయాలను వెల్లడించారు. తనకు ఇష్టమైన హీరో చిరంజీవి అని చెప్పినటువంటి శేఖర్ కమ్ముల చిరంజీవికి తాను పెద్ద అభిమాని అని తెలిపారు.

ఆయన నటన డాన్స్ యాక్షన్ సన్నివేశాలకు తాను ఎప్పుడు ఫీదా అవుతూ ఉంటానని వెల్లడించారు. ఇలా చిరంజీవికి వీరాభిమాని అయినటువంటి ఈయన ప్రభాస్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ రిలయ్ హీరో అని శేఖర్ కమ్ముల (Sekhar Kammula) పేర్కొన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో యాక్షన్ సన్నీ వేషాలలో నటిస్తూ ఫైట్ చేసిన అది ఫేక్ అనే అనిపిస్తుంది. రౌడీలను కొడుతుంటే వీళ్ళు నిజంగానే నటిస్తున్నారన్న భావన కలుగుతుంది. కానీ ప్రభాస్ మాత్రం రౌడీలను కొడితే నిజంగానే కొట్టినట్టు ఉంటుందని అంత రియాలిటీగా ఈయన నటిస్తారు అంటూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus