నందమూరి బాలకృష్ణ.. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చిత్రంతో ట్రోల్ మెటీరియల్ అయిపోయారు. ‘విజయేంద్ర వర్మ’ చిత్రంతో బాలయ్య పై ట్రోల్స్ మరింతగా ఎక్కువయ్యాయి. ఒక దశలో బాలయ్యని కావాలని ట్రోల్ చేయించడానికి దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. బోయపాటితో చేసిన సినిమాల విషయంలో తప్ప.. మిగిలిన అన్ని సినిమాల విషయంలోనూ బాలయ్య భయంకరంగా ట్రోల్ చేసేవారు. అయితే ‘లెజెండ్’ తర్వాత ఆ ట్రోల్స్ చాలా వరకు తగ్గాయి. మళ్ళీ ‘లయన్’ చిత్రంతో బాలయ్య పై ట్రోలింగ్ మొదలైంది.
కానీ ‘డిక్టేటర్’ తో బాలయ్య పై ట్రోల్స్ పూర్తిగా తగ్గాయని దర్శకుడు శ్రీవాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘బాలయ్య అంటే లార్జర్ దేన్ లైఫ్. అతనికి మాస్ లో క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ కొంతమంది దర్శకులు దానిని సరిగ్గా వాడుకోలేదు. అందువల్ల బాలయ్య పై అప్పటివరకు ట్రోలింగ్ ఎక్కువగా జరిగేది. అయితే బాలయ్య అంటే కంప్లీట్ మాస్ గానే కాకుండా స్టైలిష్ గా కూడా చూపించవచ్చు అని నేను ‘డిక్టేటర్’ తీయడం జరిగింది.
ఆ సినిమాతో నేను బాలయ్యకు ఆశించిన విజయాన్ని అందించలేకపోవచ్చు. రెవెన్యూ కూడా భారీగా చేయకపోవచ్చు. కానీ అది నిర్మాతలకు సేఫ్ వెంచర్. నేను కూడా ఆ చిత్రనిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించాను. బాలయ్యతో ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి మాస్ సినిమా చేసుండొచ్చు. కానీ నేను అలా చేయలేదు. దాని వల్ల చాలా మంది దర్శకులు బాలయ్యని స్టైలిష్ గా చూపించడం పై కూడా దృష్టి పెట్టారు.
అలా నా సినిమా వల్ల బాలయ్య పై ట్రోలింగ్ జరగకుండా చేయగలిగాను’ అంటూ దర్శకుడు (Sriwass) శ్రీవాస్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడైతే బాలయ్య కంప్లీట్ గా ఫామ్లోకి వచ్చేశాడు. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ చిత్రాల విజయాలతో భీభత్సమైన ఫామ్లో ఉన్నాడు బాలయ్య. ఈ వయసులో కూడా బాలయ్య మార్కెట్ పెరగడం.. రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాల్లో నటిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.