పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా నిన్న అంటే సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో దర్శకుడు సుజిత్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన వంతు ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది.
విషయం ఏంటంటే.. ‘ఓజి’ సినిమాలో ఓ సీన్ ఆడియన్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేసింది. ఆ సీన్ ఇంటర్వెల్ బ్లాక్. కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది క్లైమాక్స్ లో..! అదెలా అంటే సినిమా చూసిన వాళ్లకి మాత్రమే అర్థమవుతుంది. కానీ మన ఆర్టికల్ కోసం కొంచెం చెప్పుకోవాలి కాబట్టి.. తప్పదు. ఇక ఆ కన్ఫ్యూజ్ చేసే సీన్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్లో విలన్ ఇమ్రాన్ హష్మీ ముంబైలో ఉండి.. సత్య దాదా ఫ్యామిలీని, పోర్ట్ జనాలను టార్చర్ చేస్తున్నట్టు చూపిస్తారు.
మరోపక్క అదే టైంలో నాసిక్ లో ఉన్న సత్య దాదాని(ప్రకాష్ రాజ్) విలన్ తమ్ముడు వేటాడుతున్నట్టు.. అదే టైంలో అడ్డొచ్చిన కన్మణిని(ప్రియాంక అరుల్ మోహన్).. చంపేసినట్టు చూపిస్తారు. అయితే క్లైమాక్స్ లో ‘నీ భార్యని చంపింది నేనే’ అంటూ ‘ఓజి’ కి అసలు విషయం చెబుతాడు విలన్ ఓమి. కన్మణిని కాల్చి చంపిన విజువల్ ని కూడా చూపిస్తారు. అయితే ఆ గ్యాప్ లో అతను ముంబై ఎలా వెళ్ళిపోయాడు?
ఒకేసారి 2 చోట్ల విలన్ ఎలా ఉన్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి దర్శకుడు సుజిత్ క్లారిటీ ఇచ్చేశాడు. విలన్ ఓమి ఛాపర్ లో ముంబై వెళ్లాడని.. ఆ విజువల్ ను లెంగ్త్ ఎక్కువైందని ఎడిటింగ్లో లేపేసినట్టు చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలియక చాలామంది నెటిజన్లు ‘సుజిత్ మళ్ళీ దెబ్బేశాడు’ అంటూ ట్వీట్లు వేస్తున్నారని కూడా చమత్కరించాడు.