కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ప్రాణాలు నిలిపే ఆక్సిజన్‌ను పైసలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కొందామన్నా కావాల్సినంత ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలామంది దాతలు, సెలబ్రిటీలు తమవంతుగా ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర ఏర్పాట్ల కోసం దానం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా ఆక్సిజన్ కోసం ముందుకొచ్చారు. ₹25 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుకుమార్ ముందుకొచ్చారు.
దీని కోసం తన మిత్రుడు అన్యం రాంబాబుతో కలసి సబ్ కలెక్టర్ హిమాన్ష్ కౌశిక్, అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్ గోకరకొండ ప్రవీణ్‌తో బుధవారం చర్చించారట. గోకరకొండ ప్రవీణ్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కావడం గమనార్హం. ప్లాంట్ నిర్మించేందుకు అవసరమైన పనులు, వ్యయం తదితర విషయాల గురించి మాట్లాడారట. అనుమతులు లభించిన వెంటనే ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని సుకుమార్ చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్ కోసం ₹25లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సుకుమార్ అధికారులకు మాటిచ్చారు.
ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పటికిప్పుడు సిలిండర్లు అందించేందుకు ఆజాద్ ఫౌండేషన్‌కు ₹7లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు అందించారు సుకుమార్. మరోవైపు కరోనా తొలి వేవ్ సమయంలో కూడా సుకుమార్ రూ.10లక్షలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సాయానికి ముందుకొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!