టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్.. ‘సినిమాలు వదిలేస్తానంటూ’ చేసిన కామెంట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ‘పుష్ప 2’ తో (Pushpa 2: The Rule) పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన ఈ దర్శకుడు.. ‘పుష్ప 3’ ని కూడా అనౌన్స్ చేసిన ఈ దర్శకుడు ఇలాంటి కామెంట్ చేయడం ఏంటి? అంటూ అంతా షాకవుతున్నారు. విషయం ఏంటంటే.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల యూఎస్ లో జరిగింది. దీనికి దర్శకుడు సుకుమార్ (Sukumar) కూడా హాజరయ్యాడు.
Sukumar
ఈ వేడుకలో భాగంగా ‘దోప్’ అనే పాటను విడుదల చేశారు. దీనికి అర్థం ‘వదిలేయడం’ అని చెబుతూ అందరితో సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమె సుకుమార్ వద్దకి వెళ్లి… ‘సుకుమార్ గారు… మీరు ‘దోప్’ అంటే.. ఈరోజుతో ఒకటి వదిలేయాలంటే.. ఏం వదిలేస్తారు?’ అంటూ ప్రశ్నించింది. అందుకు సుకుమార్.. ‘సినిమా వదిలేస్తాను’ అంటూ జవాబిచ్చాడు. దీనికి పక్కనే ఉన్న రాంచరణ్ తో పాటు.. అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు.
వెంటనే ‘సుమ.. అందుకు నో నో వుయ్ డోంట్ అగ్రీ.. ఆ ఆన్సర్ క్యాన్సిల్’ అంటూ స్పందించింది. వెంటనే సుకుమార్ పక్కనే ఉన్న రాంచరణ్ (Ram Charan) మైక్ తీసుకుని..’కొన్నాళ్లుగా ఇదే సమాధానం చెప్పి అందరినీ భయపెట్టేస్తున్నారు(సుకుమార్).. అది జరగదు’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ ‘పుష్ప 2′ షూటింగ్ టైంలో అనుభవించిన టార్చర్ వల్ల సుకుమార్ ఇలాంటి కామెంట్ చేశాడని’ అంతా అభిప్రాయపడుతున్నారు.