టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప’ (Pushpa) ‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నాడు. రాంచరణ్ తో (Ram Charan) ఓ సినిమాకు కమిట్ అయినా.. ఇప్పట్లో అది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే హీరో చరణ్ ఈలోపు ‘పెద్ది’ (Peddi) అనే సినిమా ఫినిష్ చేసుకుని రావాలి. అది కూడా సుకుమార్ (Sukumar) శిష్యుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) డైరెక్ట్ చేస్తున్న మూవీ. దీంతో సుకుమార్ ఇప్పుడు కంగారు పడటం లేదు. ప్రశాంతంగా స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు.
ఇదొక యాంగ్రీ కాప్ కథతో రూపొందే సినిమా అని తెలుస్తుంది. మరోపక్క సుకుమార్.. తన దగ్గర ఉన్న కథలను ‘సుక్కూ రైటింగ్స్’ లో తన శిష్యులను దర్శకులుగా పెట్టి తీసే ఆలోచనలో కూడా ఉన్నాడు. ఈ క్రమంలో దిల్ రాజు (Dil Raju) వారసుడు ఆశిష్ (Ashish Reddy) హీరోగా సెట్స్ పైకి వెళ్లిన ‘సెల్ఫిష్’ (Selfish) సినిమాకి సుకుమార్ ఓ నిర్మాత. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రిప్ట్ ను రీ-రైట్ చేస్తున్నారు సుకుమార్.
త్వరలోనే ఇది మళ్ళీ సెట్స్ పైకి వెళ్తుంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవరించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య జనాలు థియేటర్లకు రావడం లేదు అనే డిస్కషన్ చాలా చోట్ల జరుగుతుంది. ఇలాంటి టైంలో థియేటర్లు బంద్ చేయాలని కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే థియేటర్లు జనాలు రావడం తగ్గడం పై సుకుమార్ స్పందించారు. ‘అది కొంతవరకు మాత్రమే నిజం. వాస్తవానికి గ్రామాల్లో జనాలు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడానికి ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే టౌన్లో ఉండే జనాలు, సిటీల్లో ఉండే జనాలు మెల్లగా ఓటీటీలకే అలవాటు పడిపోతున్నారు. వాళ్ళ బిజీ లైఫ్ లో థియేటర్ కు వెళ్లడం అనేది పెద్ద పని అని అనుకుంటున్నారు’ అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు.
, , : #Sukumar #Pushpa2 pic.twitter.com/k7n9Jezod6
— Phani Kumar (@phanikumar2809) May 21, 2025