మామూలుగానే తేజ తిక్కకి లెక్క ఉండదు. అలాంటిది ఎవరైనా బెదిరిస్తే ఉరుకుంటాడా చెప్పండి. ఆయన తీసిన తాజా చిత్రమైన “సీత” విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు మరియు కొన్ని వర్గాలు రిలీజ్ ఆపేయాలని చేస్తున్న హల్ చల్ తెలిసిందే. ఆ సినిమాలో “రా మంచమెక్కు” అనే డైలాగ్ సీత అనే పాత్రధారి విలువను తగ్గించినట్లుగా ఉందని వారి వాదన.. అయితే తేజ మాత్రం విలన్ పిలిచేది సినిమాలో సీతని, రామాయణంలో సీతను కాదు అని వెటకారంగా రిప్లై ఇచ్చినప్పటికీ.. సినిమాను ఆపేయాలి లేదా ముందు మాకు చూపించాలి అని గోల చేశారు చాలా మంది.
రేపు సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు ఈ కొందరు జనాలు చేస్తున్న గోలకి హర్ట్ అయ్యాడో ఏమో కానీ సడన్ గా నిన్న సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేశాడు తేజ. “నా సినిమాకి సెన్సార్ అయ్యింది. నేను ఎవరికీ చూపించను. ఏం పీక్కుంటారో పీక్కోండి” అని కాస్త గట్టిగానే ఫైర్ అయ్యాడు. దాంతో అప్పటివరకూ ఎగిరిన వాళ్ళందరూ కాస్త సైలెంట్ అయ్యారనే చెప్పాలి. మరి రేపు విడుదలవుతున్న సీత సినిమా ఎలాంటి రచ్చకీ తెరలేపుతుందో చూడాలి.
View this post on InstagramDirector #Teja about #Sita Title Controversy! #bellamkondasrinivas #kajal
A post shared by Filmy Focus (@filmyfocus) on