Trivikram: మరోసారి గొప్ప మనసు చాటుకున్న దర్శకుడు త్రివిక్రమ్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ఆయన వ్యక్తిత్వం. ఆయన మాట్లాడే తీరుని బట్టి ఆయనకి ఎంత సంస్కారం ఉందనేది అర్ధమవుతుంటుంది. అక్షరాలను మాత్రమే కాదు విలువలను కూడా ఎక్కువగా నమ్ముకున్న వ్యక్తి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. అందుకే ఆయన చేసే ప్రతీ పనిలో ఎతిక్స్, మోరల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక అసలు మేటర్ కు వచ్చేద్దాం. త్రివిక్రమ్ వద్ద స‌త్యం అనే కో డైరెక్టర్ పనిచేసేవారు.

కోవిడ్ టైంలో ఈయన క‌న్నుమూశారు. దాంతో త్రివిక్రమ్ ఆ కుటుంబాన్ని ఎంతో ఆదుకున్నారు. తన వంతు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మరో బాధ్యతని కూడా అతని భుజాలపై వేసుకున్నారు. విషయంలోకి వెళ్తే స‌త్యం కొడుకు వ‌శిష్ట‌ కూడా నటుడే. ఇతను ఆల్రెడీ ఓ సినిమాలో నటించాడు కానీ సక్సెస్ కాలేదు. దాంతో ఇతన్ని హీరోగా నిలబెట్టే బాధ్య‌తని త్రివిక్రమ్ తీసుకొన్నారు. త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్ వంటి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో `క‌ప్పెల‌` అనే చిత్రం రీమేక్ అవుతుంది.

ఇందులో అర్జున్ దాస్ ఓ హీరోగా ఎంపికయ్యాడు. మరో హీరో పాత్ర కోసం.. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నాడు.దీంతో అతని స్థానంలో వ‌శిష్ట‌ని పెట్టేశాడు త్రివిక్రమ్. ఇలా ఆయన త‌న కో – డైరెక్ట‌ర్ రుణం తీర్చుకున్నట్టు అయ్యింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే పోటీపడి మరీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు ఆ చిత్రం రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఈ మూవీ కనుక సక్సెస్ అయితే వశిష్ఠ హీరోగా నిలదొక్కుకున్నట్టే..!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus