అజ్ఞాతవాసి మూవీ ఫలితంలో త్రివిక్రమ్ ఇమేజ్, మార్కెట్ ఒక్కసారిగా పడిపోయాయి. భారీ నష్టాలను మిగిల్చిన ఈ మూవీ కాపీ మరక కూడా అంటించుకొని త్రివిక్రమ్ కి చెడ్డపేరు తెచ్చింది. అయినా ఇవేమి పట్టించుకోకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి అవకాశం ఇచ్చాడు. అరవింద సమేత బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోకపోయిన హిట్ అనిపించుకొని త్రివిక్రమ్ కి ఊరట ఇచ్చింది. అనూహ్యంగా తన కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్స్ ని పక్కన పెట్టి బన్నీ త్రివిక్రమ్ కి అవకాశం ఇచ్చాడు.
తన నమ్మకాన్ని నిలబెడుతూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఓ భారీ ప్లాప్ తరువాత అల్లాడుతున్న బన్నీకి అల వైకుంఠపురంలో విజయం సూపర్ జోష్ ఇచ్చింది. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ భారీ లాభాలు రాబట్టింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ కోసం పారితోషికం భారీగా పెంచేశాడని టాక్. త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో చేస్తుండగా ఆ మూవీ కోసం ఏకంగా 20కోట్ల వరకు డిమాండ్ చేశారట. అల వైకుంఠపురంలో వసూళ్లను సాకుగా చూపుతూ గట్టిగానే అడుగుతున్నాడట. ఇంత వరకు త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ గా 10 నుండి 15 కోట్లు తీసుకొనేవారట.
ఎన్టీఆర్ 30 మూవీ కోసం మాత్రం దానిని 20 కోట్లకు పెంచాడని పరిశ్రమలో వినిపిస్తున్న టాక్. లాక్ డౌన్ పరిస్థితుల వలన స్టార్ హీరోలు సైతం వారి రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారు. తమిళ్ స్టార్ హీరో తన రెమ్యూనరేషన్ లో 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా భవిష్యత్ అగమ్య గోచరంగా మారిన తరుణంలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచడం నిర్మాతలకు శరాఘాతమే అని చెప్పాలి.