Trivikram: మాటల మాంత్రికుడి తరువాత ప్రాజెక్ట్ ఇదేనా..?

అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో వరుస విజయాలను సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో తన తరువాత సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆ సమయానికి సినిమా రిలీజ్ కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ సినిమా పూర్తైన తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు.

టాలీవుడ్ లో 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోలందరూ మరో రెండేళ్ల వరకు బిజీగా ఉన్నారు. అయితే త్రివిక్రమ్ మహేష్ సినిమా తరువాత ఒక చిన్న సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథను కూడా సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాను ఎవరితో తెరకెక్కిస్తారనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం మాటల మాంత్రికుడు మహేష్ సినిమాపైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది.

మహేష్ మూవీకి హీరోయిన్, ఇతర నటీనటులను త్రివిక్రమ్ ఎంపిక చేసే పనిలో పడ్డారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. మరి తివిక్రమ్ తీసుకునే రెమ్యునరేషన్ కు చిన్న సినిమా వర్కౌట్ అవుతుందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ సినిమా తరువాత చిన్న సినిమా తెరకెక్కిస్తారో లేక మరో హీరోతో ముందుకెళతారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus