తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి వారిలో డైరెక్టర్ వివి వినాయక్ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ హీరోలకు మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. అయితే ఇటీవల కాలంలో వినాయక్ చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇకపోతే చాలా రోజుల తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి వినాయక్ సినిమా ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.
ఒకప్పుడు నాటకాలకు సినిమాలు శత్రువుగా మారాయని ఈయన తెలిపారు. అయితే ప్రస్తుతం సినిమాలకు ఓటీటీ శత్రువుగా మారింది అంటూ ఈ సందర్భంగా వినాయక్ వెల్లడించారు. ఇకపోతే ఒక సినిమా ఫ్లాప్ అయితే కనుక ఆ తప్పు మొత్తం డైరెక్టర్ల మీదకే తోసేస్తున్నారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు ముందుగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.
ఒక సినిమా కథ డైరెక్టర్ చెబుతున్నారు అంటే హీరోతో పాటు నిర్మాతలు సహ ఆర్టిస్టులు అందరికీ కూడా ఓకే అయినప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇలా అందరి అభిప్రాయం మేరకే ఒక సినిమాను చేస్తారని కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఫ్లాప్ అయితే కనుక తప్పు మొత్తం డైరెక్టర్ మీదకే వేస్తారు అంటూ ఈయన వెల్లడించారు అయితే ఆ సినిమా హిట్ అయితే కనుక డైరెక్టర్ కి చిన్న భాగం మాత్రమే ఆ హిట్ అందిస్తారని ఈ సందర్భంగా (Vv Vinayak) వి వి వినాయక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.