ప్రతి సినిమాని నటులు, టెక్నీషియన్లు కస్టపడి పనిచేస్తారు. అన్నీ హిట్ కావాలని కోరుకుంటారు. కొన్ని ఫట్ అవుతాయి, మరికొన్ని హిట్ అవుతాయి. అయితే ఈ జాబితాలో ఒకే ఒక్కటి మాత్రం మంచి గుర్తింపును తీసుకొస్తాయి. ఆ సినిమాతో అతని స్థాయి అమాంతం పెరిగిపోతుంది. అతను పేరు చెప్పగానే ఆ సినిమానే మొదట గుర్తుకు వస్తుంది. అలా దర్శకుల రేంజ్ ని పెంచిన సినిమాలపై ఫోకస్..
రాజమౌళి – సింహాద్రి స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రాజమౌళి అనే దర్శకుడు వచ్చాడని అనుకున్నారు. సింహాద్రి మూవీతో రాజమౌళి గొప్ప దర్శకుడని పేరు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో జక్కన్న స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత అతను అనేక విజయాలను అందుకున్నారు. అయినా సింహాద్రి పేరు ప్రస్తావిస్తుంటారు.
వినాయక్ – ఆదికొన్ని సినిమాల తర్వాత మంచి హిట్ సాధించడం సాధారణంగా జరుగుతుంటుంది. వి.వి. వినాయక్ మాత్రం తొలి చిత్రంతోనే బీభత్సం సృష్టించారు. నూనూగు మీసాల యువకుడు ఎన్టీఆర్ తో ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గుర్తింపు పొందారు.
సుకుమార్ – ఆర్య సుకుమార్ కూడా తొలి సినిమాతోనే తన స్టైల్ ని, క్రియేటివిని చూపించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ సుకుమార్ కి గుర్తింపుని తీసుకొచ్చింది.
త్రివిక్రమ్ – అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా మంచి పేరు సంపాదించారు. ఆయన డైరక్టర్ గా మారి నువ్వే నువ్వే తీశారు. ఇది అంతగా ఆడలేదు. ఇది త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన సినిమా అని కూడా తెలియదు. అతని పేరు అందరికీ చేసింది “అతడు” మూవీ. మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా త్రివిక్రమ్ ని స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేర్చింది.
పూరి జగన్నాథ్ – ఇడియట్ “ఎవర్రా బాబు అతను.. మనం మాట్లాడుకునే మాటలతో సినిమా తీసేసాడు..” ఇడియట్ సినిమా చూసి వచ్చి యువకుల అనుకున్న మాట ఇది. అప్పుడే పూరి జగన్నాథ్ పేరు యువతలో మారుమోగింది. పూరికి ఇడియట్ విజయాన్ని మాత్రమే కాదు, విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది.
బోయపాటి శ్రీను – సింహ నందమూరి బాలకృష్ణకు సీనియర్ డైరక్టర్లు మాత్రం విజయాన్ని అందించలేక సతమవుతున్న సమయంలో కేవలం భద్ర, తులసి అనే రెండు సినిమాలు మాత్రమే తీసిన బోయపాటి శ్రీను సింహ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చారు. ఈ సినిమా బోయపాటి కెరీర్ ని మలుపుతిప్పింది. మాస్ డైరక్టర్ అనే పేరు తెచ్చి పెట్టింది.
శేఖర్ కమ్ముల – ఆనంద్ శేఖర్ కమ్ముల, ఎన్నారై.. డాలర్ డ్రీమ్ సినిమా తీసాడు.. ఆ ఓటమికి మళ్ళీ అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేసుకుంటాడు అనుకున్నారు అందరూ. కానీ అతను తెలుగు వారికి కాఫీలాంటి సినిమాని పరిచయడం చేసాడు. ఆనంద్ మూవీ శేఖర్ కమ్ముల ప్రతిభను అందరికీ తెలిసేలా చేసింది.
రామ్ గోపాల వర్మ – శివ శివ.. ఒక దశాబ్దం పాటు తెలుగు ప్రజలు మాట్లాడుకున్న సినిమా. ఇప్పటికీ రామ్ గోపాల వర్మ పేరు చెప్పగానే.. శివ సినిమా ప్రస్తావన వస్తుంది. వర్మకి ఇది తొలి చిత్రమే అయినప్పటికీ పది చిత్రాలను తీసిన పేరుని తెచ్చి పెట్టింది.
సురేందర్ రెడ్డి – కిక్ అతనొక్కడే .. సినిమాతో సురేందర్ రెడ్డి విజయాన్ని అందుకున్నాడు గానీ పేరు అంతగా సినీ జనాలకు తెలియలేదు. ఎన్టీఆర్, మహేష్ లతో కూడా సినిమాలు చేశారు. అయినా రాని గుర్తింపు కిక్ తెచ్చి పెట్టింది. రవితేజ యమజోష్ గా నటించిన ఈ మూవీ సురేందర్ రెడ్డి కెరీర్ కి కిక్ ఇచ్చింది.
వంశీ పైడిపల్లి – ఊపిరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మున్నా నిరాశపరిచినప్పటికీ బృందావనం, ఎవడు సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఊపిరి మూవీ వంశీ సినీ జీవితానికి ఊపిరినిచ్చింది.
హరీష్ శంకర్ – గబ్బర్ సింగ్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ గలగలలాడిపోవాలి.. అంటుంటారు. అలాంటి సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఈ సినిమా హరీష్ శంకర్ రేంజ్ ని పెంచేసింది.
కొరటాల శివ – మిర్చి ఎన్నో సినిమాలకు మాటలను అందించిన అనుభవమో, సహాయ దర్శకునిగా పనిచేసిన ప్రతిభో తెలియదు గానీ కొరటాల శివ డైరక్టర్ గా అవతారమెత్తడంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మిర్చి సినిమాతో తన రాతను మార్చుకున్నాడు. వరుసగా స్టార్స్ తో సినిమాలు చేయడమే కాదు విజయాలను కైవశం చేసుకున్నాడు.