దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నేటి దర్శకులకు స్ఫూర్తి. అతను సినిమాలు చూసి కొత్త విషయాలను నేర్చుకునే సీనియర్ దర్శకులు కూడా ఉన్నారు. అయితే రాజమౌళికి క్లాస్ తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా ? ఇది నిజం. ఎందుకు జాగ్రత్తలు చెప్పారో ఆ విషయంలోకి వెళితే .. తెలుగు సినిమా రిలీజ్ అయిన వెంటనే దానిని చూడడం అది ఎలా ఉందో ట్వీట్ చేయడం రాజమౌళికి అలవాటు. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ లో ఇది ఒకటి. జక్కన్న ట్వీట్ వల్ల ఆ చిత్రం కలక్షన్స్ పెరుగుతాయి, పైగా ఆ చిత్ర బృందానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఆ మంచి అలవాటే రాజమౌళికి చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. ఇటీవల రిలీజ్ అయిన ఓ సినిమా గురించి రాజమౌళి ట్వీట్ చేశారు.
“చాలా మంచి సినిమా, ఎంజాయ్ చేసాను” అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ చూసి కొంతమంది దర్శకులు ఆ సినిమాకెళ్ళారంట. తీరా ఆ సినిమాలో విషయం ఏమి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు తమ కోపాన్ని ట్విట్టర్ వేదికపై రాజమౌళికి తెలియజేసారు. అంతేకాదు ఏ సినిమా గురించైనా ట్వీట్ చేసేటప్పుడు సాధారణ ప్రేక్షుకుడిని దృష్టిలో పెట్టుకోమని హెచ్చరించారు. దర్శకుల సూచనను రాజమౌళి పాజిటివ్ గానే తీసుకున్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.