‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మన మాస్ మహా రాజ్ రవితేజకు ఈసారి కూడా హిట్ దక్కేలా లేదు. ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అవ్వడంతో.. వాటిని మరిపించాలని ఇప్పుడు ‘డిస్కోరాజా’ చిత్రాన్ని చేసాడు రవితేజ. వి ఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 24న విడుదలై మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. ఇక ఓపెనింగ్స్ కూడా పెద్ద ఆశాజనకంగా లేవనే చెప్పాలి.
డిస్కో రాజా 2 డేస్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
1.75 cr
సీడెడ్
0.57 cr
ఉత్తరాంధ్ర
0.51 cr
ఈస్ట్
0.32 cr
వెస్ట్
0.25 cr
కృష్ణా
0.30 cr
గుంటూరు
0.28 cr
నెల్లూరు
0.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.26 cr
ఓవర్సీస్
0.40 cr
వరల్డ్ వైడ్ టోటల్
4.81 cr (share)
‘డిస్కో రాజా’ చిత్రానికి 22 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 4.81 కోట్ల షేర్ ను రాబట్టింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ లు ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు పోటీగా ఉండడం.. అందులోనూ ‘డిస్కో రాజా’ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో.. ప్రేక్షకులు అంత ఆసక్తిని చూపించలేదని తెలుస్తుంది. ఇక ఈ ‘డిస్కో రాజా’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 17.20 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా ఈ చిత్రం పెర్ఫార్మన్స్ ఇంత డల్ గా ఉండడం చూస్తుంటే చాలా కష్టం అనే అనిపిస్తుంది. మరి ఆదివారం రోజుని… ఎంత వరకూ క్యాష్ చేసుకుంటుందో చూడాలి.