పోటిగాడిలా ఎగిరావ్.. ఇప్పుడు ఒక్క టికెట్ తెగడం లేదు.. విజయ్ పై థియేటర్ ఓనర్ ఫైర్..!

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ చిత్రం నిన్న అంటే ఆగస్టు 25న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది అనే చెప్పాలి. మొదటి రోజు మొదటి షోకే ప్లాప్ టాక్ రావడంతో రెండో షోకి జనాలు తగ్గిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. రెండో రోజుకి సగానికి సగం పడిపోయాయి అనే చెప్పాలి.

సినిమా హిట్ అవ్వడం, ప్లాప్ అవ్వడం అనేది ఎవ్వరూ అంచనా వేయలేరు. దీనికి ఎవ్వరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు విమర్శలు ఎక్కువ గుప్పిస్తున్నారు నెటిజన్లు.ముఖ్యంగా విజయ్ దేవరకొండ నార్త్ లో సినిమాని బాయ్ కాట్ చేస్తే చేసుకోండి అన్నట్టు మాట్లాడడం పై అక్కడి సినీ పెద్దలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మల్టీప్లెక్స్ ఓనర్ మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండ ను అనకొండ అంటూ విరుచుకుపడ్డారు.

‘సినిమాని బాన్ చేయమని పెద్ద పోటుగాడిలా ఎగిరావు, నీ స్టేట్మెంట్ల వల్ల థియేటర్ బుకింగ్స్ తగ్గిపోయాయి.ఒక్క టిక్కెట్ కూడా తెగని పరిస్థితి. నువ్వు దేవరకొండవి కాదు అనకొండవి. గతంలో నీలాగే ఎగిరింది తాప్సి. ఏమైంది.. రోడ్ మీదికి వచ్చేసింది. దయచేసి పాలిటిక్స్ కు దూరంగా ఉండండి.

చెత్త స్టేట్మెంట్ లు ఇచ్చి సినిమాని చంపేయకండి. నిర్మాతలకు వచ్చే నష్టం ఏమి ఉండదు. మా లాంటి డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు తప్ప’ అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus