Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » పేర్లు మార్చిన తర్వాత వారి అదృష్టం ఎలా ఉందో మీకు తెలుసా.?

పేర్లు మార్చిన తర్వాత వారి అదృష్టం ఎలా ఉందో మీకు తెలుసా.?

  • April 25, 2023 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పేర్లు మార్చిన తర్వాత వారి అదృష్టం ఎలా ఉందో మీకు తెలుసా.?

చిత్ర పరిశ్రమలో కొంత మంది నటులు వారి నటన జీవితానికి వారికి ఉన్న పాత పేర్లు సరిపడవని ఆ రంగానికి సూట్ అయ్యే విధంగా పేర్లు మార్చుకొని పరిశ్రమకు పరిచయం అవుతుంటారు. అలా సినీ పరిశ్రమకు పేరు మార్చుకొని వచ్చిన నటుల గురించి ఒక్కసారి చూద్దామా.

మెగాస్టార్ చిరంజీవి – శివశంకర వరప్రసాద్

చిరంజీవి తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి గా పనిచేశాడు. తన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 154కి పైగా చిత్రాల్లో నటించాడు. పుట్టిన తేదీ 22 ఆగస్టు, 1955 (వయస్సు 68 సంవత్సరాలు)

పవన్ కళ్యాణ్- కల్యాణ్ బాబు

మెగా బ్రదర్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పవన్ కళ్యాణ్ అసల్ పేరు కల్యాణ్ బాబు. ఇప్పటికి 26 సినిమాలపైగా నటించారు. పుట్టిన తేదీ 2 సెప్టెంబర్ 1968 (వయస్సు 55)

రవితేజ – భూపతిరాజు రవిశంకర్ రాజు

రవితేజ తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. పుట్టిన తేదీ 26 జనవరి, 1968 (వయస్సు 56 సంవత్సరాలు)

ప్రభాస్ – ఉప్పలపాటి ప్రభాస్ రాజు

ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు తెలుగు నటుడు. ఇతడు “ప్రభాస్”గా సుపరిచితుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఇప్పటికి 20 సినిమాలకు పైగా నటించారు. పుట్టిన తేదీ 23 అక్టోబర్, 1979 (వయస్సు 44 సంవత్సరాలు)

రజనీకాంత్ – శివాజీరావు గైక్వాడ్

రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. పుట్టిన తేదీ 12 డిసెంబర్, 1950 (వయస్సు 73 సంవత్సరాలు)

కమల్ హాసన్-పార్థసారథి శ్రీనివాసన్

కమల్ హాసన్ భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు. కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. పుట్టిన తేదీ 7 నవంబర్, 1954 (వయస్సు 69 సంవత్సరాలు)

రానా- రామానాయుడు దగ్గుబాటి

దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా భారతీయ బహుభాషా చలనచిత్ర నటుడు, నిర్మాత, పారిశ్రామక వేత్త. ఇతను సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. ఆయన సినిమా తెరంగేట్రం లీడర్ అనే తెలుగు సినిమా తో కాగా తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించారు. రానా అసలు పేరు రామానాయుడు దగ్గుబాటి అని తాత గారి పేరే పెట్టారు. కానీ రానాగా కుదించారు. పుట్టిన తేదీ 14 డిసెంబర్, 1984 (వయస్సు 39 సంవత్సరాలు)

నాని-నవీన్ బాబు

న్యాచురల్ స్టార్ నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు. నాని అసల్ పేరు నవీన్ బాబు ఘంటా. మొదట శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాద్ లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేసాడు. పుట్టిన తేదీ 24 ఫిబ్రవరి, 1984 (వయస్సు 40 సంవత్సరాలు)

విక్రమ్-కెన్నెడీ జాన్ విక్టర్

తమిళ టాప్ హీరో విక్రమ్ అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్. తమిళనాడు రామనాథపురం జిల్లా పరమకుడిలో ఆయన జన్మించారు. చారు హాసన్, కమల్ హాజర్, సుహాసిని కూడా ఇక్కడే జన్మించారు. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘అక్కపెత్తనం చెల్లెలి కాపురం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ‘శివపుత్రుడు’ సినిమాకు గాను ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం సౌత్ లో అగ్రనటుడిగా కొనసాగుతున్నారు.

అక్షయ్ కుమార్- రాజీవ్ హరి ఓం భాటియా

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా పౌరసత్వం కలిగిన ఈ నటుడు బాలీవుడ్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2015లో ఫోర్బ్స్ ప్రపంచ అతి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో 9వ స్థానంలో అక్షయ్ నిలిచారు.

అజయ్ దేవగన్ – విశాల్ వీరూ దేవగన్

అజయ్ దేవగన్ అసలు పేరు విశాల్ వీరూ దేవగన్. అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ బాలీవుడ్ నటుడు. స్టంట్ మాస్టర్ కూడా. ‘పూల్ ఔర్ కాంటే’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

నయనతార- డయానా మరియం కురియన్

నయనతార 1984 నవంబరు 18 బెంగళూరులో జన్మించింది. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్, కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ లో పాల్గొనేది. ఆమె ను ఓ మోడలింగ్ షోలో చూసి మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె నటనకు గాను ఎన్నో అవార్డులు అందుకుంది.

ధనుష్- వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా

తమిళ నటుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. సినిమా పరిశ్రమలోకి వచ్చాక ఆయన పేరు మార్చుకున్నారు. 2011 లో ఆయన పాడిన ‘వై దిస్ కొలవెరి’ అనే పాట ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. యూట్యూబులో ఎక్కువ వ్యూస్ సాధించిన భారతీయ పాటగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈయన ఎన్నో హిట్ సినిమాలతో తమిళంలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు.

అనుష్క-స్వీటీ శెట్టి

బెంగళూరుకు చెందిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాథ్, నాగార్జున కాంబోలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలువురు అగ్ర నటులతో కలిసి నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

శ్రీదేవి- శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్

Sridevi

తమిళనాడు శివకాశిలో జన్మించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్లోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయింది.

సూర్య- శరవణన్ శివ కుమార్

తమిళ స్టార్ హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్. తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా సూర్యను ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆరు సార్లు చేర్చారు.

కార్తి- కార్తీక్ శివ కుమార్

ప్రముఖ తమిళన నటుడు సూర్య తమ్ముడే కార్తి. ఈయన అసలు పేరు కార్తీక్ శివ కుమార్. తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించారు. వరుస హిట్లతో అగ్ర నటుడిగా ఎదిగారు.

సన్నీ లియోన్- కరేన్ మల్హోత్రా

సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన సినీనటి. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడు కాగా, తల్లి హిమాచల్ ప్రదేశ్ వాసి. ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. సన్నీలియోన్ పుట్టకముందే తల్లిదండ్రులు కెనడాలో సెటిల్ అయ్యారు. 2005లో నీలి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో నటిగా కొనసాగుతోంది.

కియారా అద్వానీ- అలియా అద్వానీ

కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. ఆమె తలిదండ్రులు జగదీప్ అద్వాని, జెనీవీ జాఫ్రే. తండ్రి వ్యాపారవేత్త. తాజాగా సిద్దార్థ్ మల్హోత్రాతో ఆమె వివాహం చేసుకుంది.

యష్- నవీన్ కుమార్ గౌడ

కన్నడ స్టార్ హీరో యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. కర్ణాటక హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు.తండ్రి బస్ డ్రైవర్. చదువు పూర్తి కాగానే డ్రామా బృందంలో చేరి స్టేజి షోలు, టీవీ సీరియల్స్ చేశారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు.

ఏఆర్ రెహమాన్- దిలీప్ కుమార్

ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పూర్తి పేరు అల్లా రఖా రెహమాన్. కానీ, ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. హిందూ మతానికి చెందిన ఆయన ఆ తర్వాత ముస్లీం మతాన్ని స్వీకరించారు. తండ్రి నుంచి సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ సినిమాకు మ్యూజిక్ అందించి ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.

టబు- తబ్సుమ్ ఫాతిమా హష్మి

Tabu to be part of Telugu remake of Andhadhun1

ప్రముఖ నటి టబు అసలు పేరు తబ్సుమ్ ఫాతిమా హష్మి. హైదరాబాదీ ముస్లీం కుటుంబంలో జన్మించారు. 1980లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ‘బజార్’ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ‘కూలీ నెం.1’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. పలు భాషల్లో అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #AR Rahman
  • #Dhanush
  • #karthi
  • #Kiara Advani

Also Read

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

related news

Toxic: ‘టాక్సిక్‌’ చేతులు మారుతోందా? యశ్‌ ఏం చేయబోతున్నాడు?

Toxic: ‘టాక్సిక్‌’ చేతులు మారుతోందా? యశ్‌ ఏం చేయబోతున్నాడు?

Mahadhan: మరో సినిమా పనిలో పడ్డ రవితేజ కొడుకు.. ఆ స్టార్‌ హీరో కోసం సెట్స్‌కి!

Mahadhan: మరో సినిమా పనిలో పడ్డ రవితేజ కొడుకు.. ఆ స్టార్‌ హీరో కోసం సెట్స్‌కి!

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

trending news

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

10 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

10 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

10 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

10 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

10 hours ago

latest news

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

2 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

2 hours ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

2 hours ago
‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

10 hours ago
Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version