Actress: టాలీవుడ్ హీరోయిన్ వింటేజ్ పిక్ వైరల్..!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సామాన్యులకు తెలిసిపోతుంది. వారి వ్యక్తి గత విషయాలతో పాటు పాత చిన్నప్పటి ఫోటోలు, యవ్వనంలోకి వచ్చిన ఫోటోలు ఇలా అన్ని బయటపడుతున్నాయి. ఇవి ఎవరొకరు పోస్ట్ చేయడం తర్వాత వైరల్ గా మారడం జరుగుతుంది. కొంతమంది హీరోయిన్లు అయితే త్రో బ్యాక్ అంటూ వారి పాత ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. అలాంటి ఫోటోలు వైరల్ అవ్వడంతో పాటు లక్షల్లో లైకులు, వేళల్లో షేర్లు నమోదు చేసుకుంటున్నాయి.

తాజాగా ఓ హీరోయిన్ (Actress) వింటేజ్ పిక్ వైరల్ అవుతుంది. ఈమె ఓ టాలీవుడ్ హీరోయిన్. బ్లూ కలర్ షర్ట్ లో కాస్త జిడ్డు మోహంలో ఈమె కనిపిస్తుంది. ఆమె మరెవరో ఈపాటికే చాలా మంది కనిపెట్టేసి ఉంటారు. ఆమె మరెవరో కాదు ఈషా రెబ్బా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా .. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేసి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత కూడా ఈమె నటించిన సినిమాలు అన్నీ బాగానే ఆడాయి. కానీ ఎందుకో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కానీ స్టార్ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ను ఈమె సొంతం చేసుకుంది. అన్నిటికీ మించి ఈమె తెలుగమ్మాయి కావడంతో ప్రేక్షకుల్లో ఈమె ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus