మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కొద్దిరోజుల నుండి తరచూ ఏదో ఒక రకంగా వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం వాయిదా వేసినట్టు మేకర్స్ చెప్పుకొచ్చారు. అది లాజికల్ గా కరెక్ట్ అని అంతా భావించారు. కానీ సంక్రాంతి మిస్ అయితే సమ్మర్ సీజన్ అనేది ‘విశ్వంభర’ రిలీజ్ కి కరెక్ట్ అని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడ్డారు. అది కూడా లాజికల్ గా కరెక్టే.! ఈ క్రమంలో మే 9 ‘విశ్వంభర’కి మంచి డేట్ అనుకున్నారు.
కానీ ఆ డేట్ కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అని కొద్ది రోజుల నుండి టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ కంప్లీట్ అవ్వలేదట. మరోపక్క ఓటీటీ డీల్ కూడా ఫినిష్ అవ్వలేదు అని వినికిడి. ఈ క్రమంలో ‘విశ్వంభర’ సమ్మర్ రేస్ నుండి ఔట్ అయినట్టు టాక్ నడిచింది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనే చర్చ కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఆగస్టు నెలలో ‘విశ్వంభర’ (Vishwambhara) రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంతా చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆగస్టు 15 లేదా.. ఆగస్టు 22 తేదీల్లో ‘విశ్వంభర’ రిలీజ్ ఉండొచ్చు అనేది ఎక్కువగా వినిపిస్తున్న టాక్. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి.. ఆ డేట్ కి సినిమా వస్తే.. అభిమానులకు డబుల్ ఫీస్ట్ అవుతుందని కూడా మేకర్స్ భావిస్తున్నట్టు వినికిడి. ఇక ‘విశ్వంభర’ (Vishwambhara) సోషియో ఫాంటసీ మూవీ. ఇందులో చిరుకి జోడీగా త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే చిరు సిస్టర్స్ గా ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) వంటి వారు నటిస్తున్నారు. ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.