Mahesh Babu: సర్కారు వారి పాట దుబాయ్ సీన్ సీక్రెట్స్ ఇవే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వార్తలు వచ్చినా మహేష్ బాబు ఏప్రిల్ 1వ తేదీనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. కరోనా, ఇతర కారణాల వల్ల షుటింగ్ ఆలస్యమైతే మాత్రం ఏప్రిల్ నెలలో మరో తేదీకి ఈ సినిమా వాయిదా పడే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

ఫిబ్రవరి నెలాఖరు నాటికి తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. సర్కారు వారి పాట సినిమాలోని కొన్ని సన్నివేశాలను దుబాయ్ లో షూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ లో షూట్ చేసిన ఫైట్ సీన్లలో ఒక సీన్ అద్భుతంగా వచ్చిందని ఈ సీన్ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. బీచ్ లో ఈ ఫైట్ సీన్ ఉంటుందని మహేష్ ఈ సీన్ లో విదేశీ ఫైటర్లతో ఫైట్ చేస్తాడని తెలుస్తోంది.

ప్రముఖ స్టంట్ మాస్టర్స్ ఈ ఫైట్ కోసం పని చేశారని భారీ మొత్తం ఈ ఫైట్ సీన్ కోసం ఖర్చు చేశారని బోగట్టా. కఠినమైన పరిస్థితుల్లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మార్చి రెండవ వారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి ఉండగా ఈ ఏడాదే ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుందని బోగట్టా. మహేష్ బాబు కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజయ్యే విధంగా జాగ్రత్త పడుతున్నారు. సినిమాసినిమాకు మహేష్ కు అభిమానులు పెరుగుతున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus