మెగాస్టార్ చిరంజీవి తెలుగు తెరపై పరిచయం అక్కర లేని పేరు. చిరంజీవి కెరీర్ లో విజయాలతో పాటు అపజయాలు కూడా ఉన్నాయి. వరుస ఫ్లాపుల తర్వాత హిట్లర్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని కంబ్యాక్ అయిన మెగాస్టార్ మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో వరుసగా సినిమాలను ఒప్పుకోవడం అవి సూపర్ సక్సెస్ అవుతూ ఉండటంతో ఆయనతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు క్యూ కట్టారు. హిట్లర్, మాస్టర్, చూడాలని ఉంది, బావగారూ బాగున్నారా, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, డాడీ, ఇలా వరుసబెట్టి హిట్స్ కొట్టారు.
ఆ సమయంలో హిందీలో సంజయ్ దత్ నటించగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శంకర్ దాదా ఎం ఎం బి బి ఎస్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. అలా శంకర్ దాదా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. ఆ తర్వాత స్టాలిన్ వచ్చి డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ శంకర్ దాదా జిందాబాద్ గా సీక్వెల్ సినిమా హిందీలో వచ్చి సక్సెస్ సాధించగా ఆ సీక్వెల్ మూవీని కూడా చిరు రీమేక్ చేశారు.
మొదటి భాగానికి జయంత్ సి పరాన్‌జీ దర్శకత్వం వహించగా సీక్వెల్ కి మాత్రం ప్రభుదేవా డైరెక్షన్ చేశాడు. కామెడీ వరకు ఓకే గానీ ఓవరాల్ గా మాత్రం శంకర్ దాదా జిందాబాద్ పెద్దగా వర్కౌట్ కాలేదు. మొదటి భాగంలో సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్‌గా నటించిన సోనాలి బింద్రే. కానీ, సీక్వెల్ లో మాత్రం కరిష్మా కొటక్ అనే అమ్మాయి నటించింది.
ఎంత చిరంజీవి (Chiranjeevi) ఏజ్ కి తగ్గట్టు తీసుకున్న మరీ సగం వయసైపోయిన ముదురులా కనిపించింది. పోస్టర్స్ చూస్తే అబ్బేఅ అనుకుంటే సినిమాలో చూసి చిరాకు పడ్డారు. అసలు ఎవరు ఈ అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిందీ అని జనాలు తిట్టుకున్నారు. సీక్వెల్ ఫ్లాప్ కి కారణం చాలావరకు హీరోయిన్ అని కూడా అప్పట్లో టాక్ వినిపించింది.