అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ప్రమోషన్స్ జాడ ఎక్కడ?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అది కూడా పాన్ ఇండియా సినిమా అనడంతో వారి అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్టు పెరిగాయి. కానీ రాను రాను వారిలో ఉత్సాహం తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నీరసంగానే ఉన్నాయి. ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ మారింది. టీజర్ కూడా సురేందర్ రెడ్డి సినిమాల స్థాయిలో లేదు. విడుదల చేసిన పాటలు కూడా జనాలకు ఎక్కలేదు.

సరే ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు నెల రోజుల నుండి ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. కానీ ‘ఏజెంట్’ విషయంలో జరగడం లేదు. పైగా అదే డేట్ కు ‘పీఎస్-2′(పొన్నియన్ సెల్వన్-2) కూడా రిలీజ్ కాబోతోంది. సో తమిళంలో ‘ఏజెంట్’ రిలీజ్ అయినా కలెక్షన్లు రావడం కష్టం. పైగా ప్రమోషన్స్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి..

అక్కడ రిలీజ్ చేయకపోవడమే బెటర్ అన్న కామెంట్లు ఇప్పుడు మొదలయ్యాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు.ప్యాచ్ వర్క్ జరుగుతుందని సమాచారం. ఇప్పటి నుండి ప్రమోషన్స్ మొదలుపెట్టినా.. జనాలు థియేటర్ కు రావాలి అంటే బలమైన ప్రమోషనల్ కంటెంట్ కావాలి.

లేదంటే బంగారం లాంటి సమ్మర్ సీజన్లో సినిమా రిలీజ్ చేసినా.. ఉపయోగం ఏమీ ఉండదు. ఇక ఏజెంట్ చిత్రాన్ని అనిల్ సుంకర.. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus