మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. సీతారామం వంటి చిత్రంతో తన నటనతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న దుల్కర్, ఇటీవల లక్కీ భాస్కర్‌తో (Lucky Baskhar) వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇప్పుడు మరో విభిన్న కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయనతో జతకట్టేది అందాల నటి పూజా హెగ్డే(Pooja Hegde). ఈ కొత్త జోడీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Dulquer Salmaan
ఇటీవల దసరా (Dasara) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ బ్యానర్, ఈసారి దుల్కర్ పూజా జంటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ముఖ్యంగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవి దర్శకత్వం వహిస్తూ ఉండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. రవి స్టార్ డైరెక్టర్ పరశురామ్ (Parasuram) శిష్యుడు. మహేష్ బాబు (Mahesh Babu) సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
దర్శకుడిగా ఇదే ఆయన తొలి ప్రయత్నం కావడం, దుల్కర్ అతనిపై చూపిన నమ్మకాన్ని హైలైట్ చేస్తోంది. కంటెంట్ బలంగా ఉండే కథలే దుల్కర్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్‌లో కూడా అదే ఫాలో అయ్యారని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 11 నుంచి రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనుంది. డిసెంబర్ మొదటి వారంలో స్క్రీన్ టెస్టింగ్ పూర్తి చేసిన తర్వాత, కీలకమైన షెడ్యూల్ ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు.
ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం ఉండబోతున్నప్పటికీ, కథనం వైవిధ్యంగా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దుల్కర్ – పూజా హెగ్డే జంట తొలిసారి తెరపై కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దుల్కర్ మార్కెట్ ఇప్పుడు మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా పెరిగింది. తెలుగు దర్శకులు వరుసగా అతనితో సినిమాలు చేస్తుండడం విశేషం.