ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2′(పుష్ప 2 ది రూల్) (Pushpa 2 The Rule) చిత్రం మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపటి నుండి అంటే డిసెంబర్ 4 నైట్ నుండే ప్రీమియర్ షోలు వేస్తున్నారు. 2021 లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa) విజయం సాధించింది. ముఖ్యంగా నార్త్ లో సినిమా భారీ వసూళ్లు సాధించింది. మిగతా భాషల్లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ దాదాపు 3 ఏళ్ళు కష్టపడి ‘పుష్ప 2’ ని తెరకెక్కించారు.
Pushpa 2 The Rule First Review
రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) స్పెషల్ సాంగ్ చేసింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు వీక్షించడం జరిగింది. తర్వాత వారిని ఆరా తీయగా ‘పుష్ప 2’ గురించి వాళ్ళు స్పందించారు. ‘పుష్ప’ లో చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. కొండారెడ్డి(అజయ్ ఘోష్) (Ajay Ghosh) చనిపోయాక జాలి రెడ్డి(డాలి ధనుంజయ) ఏమయ్యాడు? ‘పుష్ప’ చేతిలో చావు దెబ్బలు తిని మంచాన పడిన అతను కోలుకుని పుష్ప పై పగ తీర్చుకోవడానికి వెళ్లాడా? పుష్ప చేతిలో అవమానాలు పాలైన మంగళం శీను(సునీల్)(Sunil)..
పెళ్ళాం దాక్షాయణి(అనసూయ) (Anasuya Bhardhwaj) చేతిలో చావబోయిన అతను తిరిగి కోలుకున్నాడా? కోలుకుని పుష్పపై ఎలా పగ తీర్చుకున్నాడు? భన్వర్ సింగ్ షెకావత్(ఫహాద్ ఫాజిల్) (Fahadh Faasil) ఇగో వల్ల పుష్ప ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ‘పుష్ప’ ఫ్యామిలీ అయిన మొల్లేటి మోహన్ రాజ్(అజయ్) (Ajay), మొల్లేటి ధర్మరాజ్(శ్రీతేజ్)..లకి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి? పుష్ప తల్లి కోరిక మేరకు కుటుంబం అంతా ఒక్కటయ్యిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘పుష్ప 2’ సినిమా అని అంటున్నారు.
పుష్ప కంటే గొప్పగా అల్లు అర్జున్ పుష్ప 2 లో నటించాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందట. ప్రతి 15 నిమిషాలకు ఒక హై మూమెంట్ సినిమాలో ఉందట. గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ కి, నార్త్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ అని అంటున్నారు. మొత్తంగా సినిమా అదిరిపోయింది అని చెబుతున్నారు. మరి ప్రీమియర్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి