Lucky Baskhar: ‘లక్కీ భాస్కర్’ మళ్ళీ వాయిదా?
- August 19, 2024 / 02:49 PM ISTByFilmy Focus
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Attluri) దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ పై సాయి సౌజన్య (Sai Soujanya) సహా నిర్మాతగా వ్యవహరిస్తుండగా….’శ్రీకర ప్రొడక్షన్స్’ సంస్థ సమర్పిస్తుంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఇందులో హీరోయిన్. జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది.
Lucky Baskhar

‘ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నత శిఖరాలు చేరుకున్న అసాధారణమైన ప్రయాణం’.. ఎలా ఉంది? అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. టీజర్లో భాస్కర్(దుల్కర్ సల్మాన్) ‘ఓ బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపించినప్పటికీ.. అతను బ్యాంకు ఖాతాలో బోలెడు డబ్బు ఉన్నట్టు’ చూపించి సినిమాపై హైప్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అలాగే ‘శ్రీమతి గారు’ అనే లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.
ఇదిలా ఉండగా.. ‘లక్కీ భాస్కర్’ చిత్రం సెప్టెంబర్ 7 న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇంకా ప్రమోషన్స్ వంటివి స్టార్ట్ చేయలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా ఆ డేట్ కి రిలీజ్ రాకపోవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బ్యాలెన్స్ ఉన్నాయట. అందువల్ల ఆ డేట్ కి ‘లక్కీ భాస్కర్’ రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపించడం లేదని అంటున్నారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అనేది ఇది మొదటిసారి కాదు.

ముందుగా సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఆ తర్వాత జూలై అన్నారు,తర్వాత సెప్టెంబర్ 27 ఫిక్స్ అన్నారు. దాని తర్వాత సెప్టెంబర్ 7 కే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి కూడా సినిమా వచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. త్వరలోనే కొత్త డేట్ ని అనౌన్స్ చేసే పనుల్లో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.














