2 నెలల క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న/చేసిన సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘యువతని ఈ బెట్టింగ్ యాప్స్ పక్కదోవ పట్టిస్తున్నాయని, డబ్బులు కోసం ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తూ యువత డబ్బులు కోల్పోయే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడటానికి కూడా ఇదొక కారణం.. అందుకే ఈ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై కేసులు పెట్టి అరెస్ట్ చేయబోతున్నాం’ అంటూ సీనియర్ ఐపీఎస్ అయినటువంటి సజ్జనార్ వెల్లడించడం జరిగింది.
తర్వాత కొంతమంది సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టడం, నోటీసులు పంపడం, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించడం జరిగింది. సురేఖ వాణి కూతురు సుప్రీత, రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, విష్ణుప్రియ వంటి వాళ్ళ పేర్లు ఇందులో ఉన్నాయి. తర్వాత వాళ్ళు సంజాయిషీ ఇచ్చుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు అని అంతా అనుకున్నారు.
కానీ ఈ విషయంలో ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ పై కేసు నమోదు చేసిన వారిలో 29 మంది పై PMLA యాక్ట్ కింద మనీ ల్యాండరింగ్ కేసులు పెట్టడం జరిగింది. ఈ లిస్టులో మంచు లక్ష్మి, రానా, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, నిథి అగర్వాల్ వంటి వారు ఈ లిస్టులో ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఆఫ్ ది రికార్డ్ లిక్విడ్ క్యాష్ తీసుకున్న కారణంగా వీరిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతుంది.