పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ,కీర్తి రెడ్డి (Keerthi Reddy) జంటగా నటించిన ‘తొలిప్రేమ’ (Tholi Prema ) క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎ.కరుణాకరణ్ (A. Karunakaran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.జి.రాజు (G. V. G. Raju) నిర్మించారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో 4వ సినిమాగా రూపొందిన ‘తొలిప్రేమ’… అతనికి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేసింది అని చెప్పాలి. 1998 వ సంవత్సరం జూలై 24న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. విడుదలకి ముందు దీనిపై పెద్దగా అంచనాలు లేవు.
Tholi Prema
కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో.. షో షోకి బుకింగ్స్ పెరుగుతూ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది ఈ చిత్రం. ‘తొలిప్రేమ’ ఓ క్లాసిక్ అని అంతా చెబుతుంటారు. ఇప్పుడు చూసినా కూడా ఆ సినిమా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ఓ సంఘటన గురించి ఎడిటర్ మార్తాండ కె వెంకటేష్ (Marthand K. Venkatesh) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మార్తాండ కె వెంకటేష్ మాట్లాడుతూ…” ‘తొలిప్రేమ’ చిత్రం బాగా వచ్చిందని మేమంతా ఫీలయ్యాము. కానీ బయ్యర్స్ కి వేస్తే పడుకున్నారు. సినిమా అయిపోయాక అందరూ వెళ్ళిపోతున్న టైంలో ఒకతను వచ్చి.. ‘ఏంటయ్యా..? నీకు ఆడవాళ్ళు అంటే నచ్చారా? హీరోయిన్..ని అంత బాగా చూపించారు, కానీ సినిమాలో ఒక్క ఫిమేల్ సాంగ్ కూడా లేదు’ అన్నాడు. అతను చెప్పేంతవరకు మాకు తెలీదు ‘సాంగ్స్ లో ఫిమేల్ వాయిస్ లేదు’ అని.
తర్వాత సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి.. ఎవ్వరిదీ కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అని అనలేం. కానీ సినిమా చేస్తున్నప్పుడు మేము ఎక్సయిట్ అయ్యాము. ‘ఇది మంచి సినిమా అవుతుంది అని’. సిస్టర్ సెంటిమెంట్ బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ ‘బాయ్ నెక్స్ట్ డోర్’ అన్నట్లు ఉంటాడు. ఇవన్నీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. అలా అనిపిస్తే సినిమా హిట్టే అని మా లెక్క. అది నిజమైంది” అంటూ చెప్పుకొచ్చాడు.