‘రాధే శ్యామ్’… ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం.ప్రభాస్ అభిమానులు ఈ మూవీ కోసం దాదాపు మూడున్నరేళ్ళుగా ఎదురుచూస్తున్నారు.మొత్తానికి సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు కూడా ప్రకటించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్లని కూడా మొదలుపెట్టారు. ఈ మధ్యనే విక్రమాదిత్య పాత్రకి సంబంధించి ఓ గ్లిమ్ప్స్ ను విడుదల చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేశారు.
‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన ప్రోమోని చిత్ర బృందం సాయంత్రం విడుదల చేసి క్యూరియాసిటీని పెంచారు. కానీ పాటని మాత్రం చాలా ఆలస్యంగా విడుదల చేశారు.’ ఎవరో వీరేవరో’ అంటూ మొదలైన ఈ పాట వర్త్ వెయిట్ అనిపించింది.
‘ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..
వీరి దారొకటే.. మరి దిక్కులే వేరులే..
ఊపిరొకటేలే.. ఒక శ్వాసలా నిశ్వాసలా ఆటాడే విధా ఇదా ఇదా పదే పదే..
కలవడం ఎలా ఎలా.. రాసే ఉందా రాసే ఉందా..
ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..
ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..
ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో.. నాతో ఏదో కథ చెప్పాలంటుందే..
ఏ గూఢాచారో.. గాఢంగా నన్నే..
వెంటాడెను ఎందుకో ఏమో..కాలం మంచు కప్పి గుండెల్లో గుచ్చే..
గాయం లేదు కానీ దాడెంతో నచ్చే..
ఆ మాయా ఎవరే.. రాదా ఎదురే.. తెలియకనే తహతహ పెరిగే..
నిజమో భ్రమో.. బాగుంది యాతనే..
కలతో కలో.. గడవని గురుతులే..
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే
ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..
ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా.. ‘ అంటూ యువన్ శంకర్ రాజా, హరిణి ఎంతో ఉత్సాహంగా పాడిన ఈ పాట వినసొంపుగా ఉంది. మీరు కూడా ఓసారి వినెయ్యండి.