Rajamouli: హాలీవుడ్‌ సినిమాపై రాజమౌళి ఏమన్నారో తెలుసా?

భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. హాలీవుడ్‌ సినిమాను కళ్లప్పగించి చూస్తూ వావ్‌ అనుకునే మన తెలుగు ప్రేక్షకుల్ని, ఇది మా తెలుగు నేలపై తెరకెక్కిన సినిమా అని గొప్పగా చెప్పేలా చేసిన దర్శకుడాయన. ఆయన వర్క్‌లో హాలీవుడ్‌ ఎసెన్స్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ కూడా అందరినీ అంతలా ఆకట్టుకుంటున్నాయి. మరి రాజమౌళికి హాలీవుడ్‌ సినిమా చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు? ఏముంది ఆ టెక్నాలజీ, ఆ బిగ్‌ కాన్వాస్‌ మీద అదరగొట్టేస్తారు అనుకుంటున్నారా? కాదు, కాదు ఆయన ఆలోచన వేరేలా ఉంది.

ఇప్పుడదే వైరల్‌గా మారింది. ‘బాహుబ‌లి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలు అంత‌ర్జాతీయ స్థాయిలో అద‌ర‌గొట్టిన నేప‌థ్యంలో మరి హాలీవుడ్‌లో సినిమాలు కూడా చేస్తారా… మార్వెల్ త‌ర‌హా సినిమాలు చేసే ఆలోచన ఉందా అని రాజమౌళిని అడిగారు ఓ పాత్రికేయుడు. దానికి రాజమౌళి చాలా కూల్‌గా నో చెప్పేశారట. ‘‘భార‌తీయ పురాణాలు, సంస్కృతి మీద చిన్నతనం నుండి అవ‌గాహ‌న పెంచుకుని, ఇక్క‌డి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లు సినిమాలు తీస్తూ వ‌స్తున్నాను. అదే నాకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది’’ అని చెప్పారట రాజమౌళి.

అంతేకాదు మార్వెల్ త‌ర‌హా సినిమాలపై తనకంత ప‌ట్టు లేద‌ని, ఆ సినిమాలు త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గ‌వ‌ని కూడా అన్నారట రాజమౌళి. మార్వెల్ సినిమాల‌ను ప్రేక్షకుడిగా బాగానే అస్వాదిస్తాను.. అంతేకానీ అలాంటి సినిమాలు తీయ‌లేను అని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు వీలైతే మ‌న క‌థ‌ల‌నే మార్వెల్ త‌ర‌హాలో తెరకెక్కిస్తా అన్నారట. వీలైతే అంత‌కుమించి ఉండేలా చూస్తా అని కూడా చెప్పారట. అదిరిపోయింది కదా రాజమౌళి ఆన్సర్‌. ఏదైనా మన కథలు, పురాణాల్లో ఉన్నంత సినిమా తీసేంత స్టఫ్‌ ఇంకెక్కడా ఉండదు కదా.

అయితే ఇక్కడో మేటర్‌, మొన్నామధ్య రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి ఓ యానిమేషన్‌ సినిమా చేస్తారని చెప్పుకొచ్చారు. దీని కోసం ఓ హాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌తో టై అప్‌ అవుతున్నట్లు కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి వార్తలు లేవు. అదొస్తే మార్వల్‌ కాదు కానీ, హాలీవుడ్‌ సినిమా అయితే జక్కన్న నుండి వచ్చినట్లే.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus