కేంద్ర ప్రభుత్వం థియేటర్లు అక్టోబర్ 15 నుండి తెరచుకోమని చెప్పింది. కాని రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇంకా అనుమతులు రాలేదు. వాటి కోసం తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లు కల కార్పొరేట్ కంపెనీలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరవడానికి, షోలు వెయ్యడానికి రెడీగా వున్నారు. కాని నిర్మాతలు రెడీగా లేరు. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు అందరూ రెండు మూడు రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.
థియేటర్లు ఓపెన్ చేస్తే ప్రేక్షకులు వస్తారనేది వాళ్ళ ఆశ. కరోనా నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో చర్చించనున్నారు. మాస్కులు లేకుండా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా మాస్కులు అందించడానికి ఎగ్జిబిటర్లు సూత్రప్రాయంగా సిద్ధమయ్యారు. 50 శాతం షూటింగ్ సామర్ధ్యంతో థియేటర్లు నడవడం సాధ్యమా? కష్టమా? అనేది ప్రముఖంగా ఆ సమావేశంలో చర్చించుకున్నారు. అయితే చాలామంది థియేటర్లు తెరవడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. నిర్మాతలు విడుదల చేస్తారా? లేదా? అనే సందేహాలు కూడా ఎగ్జిబిటర్లు మధ్యలో నెలకొన్నాయి.
గతంలో వచ్చినట్లు ఎగ్జిబిటర్లకు లాభాలు అయితే రావు. మూసి ఉంచడం వలన కష్టాలు తప్ప మరేమీ లేదని థియేటర్లు తెరవడానికి రెడీ అవుతున్నారు. శానిటేషన్ మాస్కులు ఉచితంగా ఇవ్వడం వంటివి వాళ్ళకు అదనపు ఖర్చులే.