F3 Censor Details: ఎఫ్ 3 రన్ టైం ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా గతంలో మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకులకు కావలసినంత సంతోషాన్ని అందించింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో అనిల్ రావిపూడి ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించారు.ఇక ఈ సినిమా కూడా అంతే వినోదాత్మకంగా ఉంటుందని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈనెల 27వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి బుల్లితెరపై ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో పాల్గొని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాని చూసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు ఈ సినిమా పై స్పందిస్తూ చాలా కాలం తర్వాత క్లీన్ అండ్ హెల్తీ ఎంటర్టైనర్ వీక్షించినట్లు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యూ (U) సర్టిఫికేట్ వచ్చిందని మేకర్స్ తెలిపారు.

ఇక ఈ సినిమా చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో ఈ సినిమా హిట్ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు.ఈ సినిమాకి క్లీన్ యు సర్టిఫికెట్ రావడమే కాకుండా, రన్ టైం కూడా సెన్సార్ సభ్యులు ప్రకటించారు. ఈ సినిమా 2 గంటల 28 నిమిషాల రన్ టైం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, సోనాల్ చౌహాన్, మెహరీన్ ప్రధాన పాత్రలలో నటించగా, పూజా హెగ్డే ప్రత్యేక పాత్ర ద్వారా సందడి చేయనుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ నిర్మిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.