వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 మూవీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చడంతో కొన్ని మైనస్ లు ఉన్నా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఎఫ్3 మూవీ మండే బుకింగ్స్ బాగానే ఉన్నాయని తెలుస్తోంది. వేసవి సెలవులు ఒక విధంగా ఈ సినిమాకు ప్లస్ అవుతున్నాయి.
విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడంతో మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా బాగానే కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ ఖాతాలో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. వెంకీ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. దిల్ రాజు నిర్మాతగా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ తో పోల్చి చూస్తే ఫస్ట్ వీకెండ్ లో 50 శాతానికి పైగా కలెక్షన్లను ఎఫ్3 సాధించడం గమనార్హం.
సెకండ్ వీకెండ్ సమయానికి ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి ఎఫ్3 కలెక్షన్లపై ఈ సినిమాలు ప్రభావం చూపుతాయో లేదో చూడాలి. అనిల్ రావిపూడి మాత్రం వరుసగా ఆరు సక్సెస్ లు సాధించి దర్శకుడిగా తన రేంజ్ ను పెంచుకున్నారనే చెప్పాలి.
అనిల్ రావిపూడి పరిమిత బడ్జెట్ లోనే సినిమాలను నిర్మిస్తూ ఉండటం నిర్మాతలకు కూడా ఒక విధంగా ప్లస్ అవుతోంది. నారప్ప, దృశ్యం2, ఎఫ్3 సినిమాలతో వెంకటేష్ వరుస విజయాలను సొంతం చేసుకుని ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. సినిమాసినిమాకు వెంకటేష్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వెలువడాల్సి ఉంది. వెంకీ త్రివిక్రమ్ కాంబో మూవీ దాదాపుగా ఆగిపోయినట్టేనని తెలుస్తోంది.