Fahad Fazil: చిన్న గాయంతో తప్పించుకున్నా.. ఫహద్ ఫాజిల్ కామెంట్స్!
- June 17, 2021 / 05:25 PM ISTByFilmy Focus
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి వివరాలను వెల్లడించాడు. ఇటీవల ఫహద్ ఫాజిల్ ఓ సినిమా షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించారు. దీనిపై స్పందించిన ఫహద్.. పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లు ఓ లేఖను విడుదల చేశాడు. ‘మలయాన్ కుంజు’ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎత్తు నుండి కింద పడిపోయానని తెలిపాడు.
ఆ సమయంలో తల వేగంగా నేలకు తాకకుండా చేతులు భూమికి ఆనించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారని చెప్పాడు. సాధారణంగా అంత ఎత్తు నుండి పడేప్పుడు చేతులు ముందుకు చాచడం అంత ఈజీ కాదని.. కానీ అదృష్టవశాత్తు ఆ సమయంలో తన మెదడు చురుగ్గా పని చేసిందని చెప్పుకొచ్చాడు. తన అదృష్టం మరోసారి కాపాడిందని ఫహద్ తెలిపాడు. ఈ యాక్సిడెంట్ లో తన ముక్కుకు గాయం కావడంతో మూడు కుట్లు వేశారని. నొప్పి తగ్గడానికి ఇంకాస్త సమయం పడుతుందని అన్నాడు.

ప్రస్తుతం ఫహద్ నటించిన ‘మాలిక్’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ రిలీజ్ పై ఫహద్ పాజిటివ్ గా స్పందించారు. ఇక తెలుగులో సుకుమార్ రూపొందిస్తోన్న ‘పుష్ప’ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు ఈ మలయాళీ స్టార్ హీరో.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?












