ఫహాద్ ఫాజిల్ తండ్రి డైరెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా అదేనట..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా షురూ అయ్యాయి. ఈ మధ్యనే ట్రైలర్ కూడా విడుదల చేశారు.ఈ ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ హీరో కంటే ఎక్కువగా చివర్లో వచ్చే మ‌ల‌యాళం న‌టుడు ఈ చిత్రం విలన్ అయిన ఫ‌హ‌ద్ ఫాజిల్‌ హైలెట్ అయ్యాడు.’పార్టీ లేదా పుష్ప’ అనే ఒక్క డైలాగ్ తో ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాడు. సినిమాలో కూడా ఇతని పాత్ర పీక్స్ లో ఉంటుందని ప్రేక్షకులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఇతను సెకండ్ పార్ట్ లో నే ఫుల్ లెంగ్త్ విలన్ గా కనిపిస్తాడని.. ఫస్ట్ పార్ట్ లో ఇతను క్లైమాక్స్ లో మాత్రమే కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. అవి నిజమో కాదు మరో 9 రోజుల్లో తేలిపోతుంది. ఇదిలా ఉండగా.. ఫహాద్ ఫాజిల్ మ‌ల‌యాళంలో ఓ స్టార్ హీరో అన్న సంగతి తెలిసిందే.నేషనల్ అవార్డు విన్నర్ కూడా. ‘ట్రాన్స్’ ‘సి యు సూన్‌’, ‘ఇరుళ్‌’, ‘జోజి’, ‘మాలిక్’.. వంటి ఇతను నటించిన చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లో విడుదలయ్యాయి. దాంతో ఇతని క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇదిలా ఉండగా.. ఇతని తండ్రి కూడా టాలీవుడ్లో ఓ సినిమాని తెరకెక్కించాడన్న విషయం బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. 1991 వ సంవత్సరంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘కిల్లర్’ చిత్రాన్ని ఫాజిల్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. అతను మరెవరో కాదు మన ఫహాద్ ఫాజిల్ తండ్రి. అయితే ‘కిల్లర్’ చిత్రం ఇక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు కానీ.. ‘ప్రియా ప్రియతమా రాగాలు.. సఖి కుశలమా అందాలు’ అనే పాట ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus