Dil Raju, Ram Charan: దిల్ రాజు – చరణ్ మరో ప్రాజెక్ట్.. ఇది అసలు సంగతి!
- January 28, 2025 / 06:42 PM ISTByPhani Kumar
టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ (Game Changer) సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ తో నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం దిల్ రాజుకు కనీసం ₹120 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దిల్ రాజు కెరీర్‌లో ఇంత పెద్ద డిజాస్టర్ ముందు ఎప్పుడూ చూడలేదని పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి.
Dil Raju, Ram Charan

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ (Ram Charan) తన ప్రొడ్యూసర్‌ను ఆదుకునేందుకు మరో ప్రాజెక్ట్ చేస్తాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్ దిల్ రాజుకు (Dil Raju) భరోసా ఇచ్చి, “మీ బ్యానర్‌లో మరో సినిమా చేస్తాను,” అని చెప్పినట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే చరణ్ పీఆర్ టీమ్ ఈ విషయంపై స్పందిస్తూ, ప్రస్తుతం చరణ్ షెడ్యూల్ పూర్తిగా బిజీగా ఉందని క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ 2025లో పూర్తి కావచ్చని అంచనా. దీని తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా కనీసం రెండు సంవత్సరాలపాటు కొనసాగుతుందని సమాచారం. ఈ కారణంగా, 2027లో తప్ప చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ చేయడం కష్టమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక దిల్ రాజు గేమ్ చేంజర్ నష్టాలను కవర్ చేసేలా, సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కొంత మేర సేఫ్ అయ్యారు.

ఈ సినిమా మంచి వసూళ్లతో దిల్ రాజు ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుకోవడానికి సహాయపడింది. దిల్ రాజు మీడియం రేంజ్ సినిమాల వైపు దృష్టి పెట్టి భవిష్యత్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో ఆయన మళ్ళీ పెద్ద సినిమాలు చేయకపోవచ్చని సమాచారం.

















