Krishna: కృష్ణ ఆరోగ్యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌

అదిగో పులి అంటే ఇదిగో తోక అనడం ఇటీవల కాలంలో నెటిజన్లు అలవాటైపోయింది. ఏదో ఫొటో చూసి, ఫలానా వ్యక్తికి ఆరోగ్యం బాలేదు అంటూ ప్రచారం మొదలెట్టేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ నటుడు కృష్ణ ఆరోగ్యం గురించి పుకార్లు మీద పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయమై కుటుంబ సభ్యులు స్పందించారు. కృష్ణ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించారు. అంతేకాదు కృష్ణ ‘సూపర్‌’గా ఉన్నారంటూ కొత్త ఫొటోను బయటకు తీసుకొచ్చారు.

Click Here To Watch NOW

కృష్ణ ఇటీవల ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఫేస్‌ చూసి రకరకాల అనుమానాలు, సందేహాలు వచ్చాయి. ఫొటోలో కృష్ణ ముఖం మీద ఏవో తెల్ల మచ్చలు ఉన్నట్టు కనిపించాయి. దీంతో సూపర్‌స్టార్‌కి ఏమైందా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే అసలు విషయం ఏంటి అనేది బయటికొచ్చింది. అవి తెల్ల మచ్చలు కావని, ముఖానికి గ్లాస్ మాస్క్‌ లాంటిది పెట్టుకోవడం వల్ల అలా ఉన్నారని తెలిసింది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో కృష్ణ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మాస్క్ లేకుండా బయటకు రావడం లేదు. ఈ క్రమంలో గ్లాస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఫొటోలో మచ్చల్లా కనిపించింది. అయితే అభిమానులు మాత్రం కృష్ణకు ఏమైంది అంటూ ఆరా తీయడం కొనసాగిస్తున్నారట. దీంతో కృష్ణ లేటెస్ట్ ఫొటోను బయటకు విడుదల చేశారు. దీంతో అనుమానాలకు సమాధానం వచ్చిందని చెప్పొచ్చు. విజయనిర్మల ఉన్నంతవరకు యాక్టివ్‌నే కనిపించిన కృష్ణ.. ఇటీవల కాస్త డౌన్‌ అయ్యారు అని చెప్పొచ్చు.

కృష్ణకు ప్రస్తుతం 78 ఏళ్లు. దీంతో వయసుతో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి తప్ప.. పెద్ద ఇబ్బందులు ఏమీ లేవని, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదు అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సోషల్‌ మీడియాలో మాస్క్‌ ఫొటో పెట్టి ఆందోళన చెందుతున్నాం అంటూ అనవసర పుకార్లు రేపుతున్న వారికి… నెటిజన్ల నుండి ఘాటైన రిప్లైలు వస్తున్నాయి. ఏమీ చూడకుండా నోటికొచ్చినట్లు రాయొద్దు అంటూ గట్టిగానే చెబుతున్నవాళ్లూ ఉన్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus