Dil Raju: దిల్ రాజుని టెన్షన్ పెడుతున్న ‘ఫ్యామిలీ స్టార్’.!

విజ‌య్ దేవ‌ర‌కొండ- దిల్ రాజు కాంబినేషన్లో రూపొందుతున్న మొదటి సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీత గోవిందం’ దర్శకుడు ప‌ర‌శురామ్.. విజయ్ తో చేస్తున్న రెండో మూవీ ఇది. ఈ మధ్యనే గ్లింప్స్ వదిలారు. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘ఐరనే వంచాలా ఏంటి?’ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ఓ రేంజ్లో పేలింది. సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ముందుగానే ప్రకటించింది. ‘సీతా రామం’ తర్వాత మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇది.

కాబట్టి సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. గ్లింప్స్ అయితే ఆ అంచనాలు డబుల్ చేసిందని చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవచ్చు అని కొద్దిరోజులుగా వినిపిస్తున్న టాక్. విషయం ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించి అమెరికాలో జ‌ర‌గాల్సిన ఓ షెడ్యూల్ అనివార్య కార‌ణాల వ‌ల్ల జరగలేదట. ఆ షెడ్యూల్ కి రెండు, మూడు వారాలు టైం పట్టొచ్చని అంటున్నారు. దాని తర్వాత మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేయాలి.

ఎలా చూసుకున్నా.. అనుకున్న టైంకి ‘ఫ్యామిలీ స్టార్’ కంప్లీట్ అవ్వడం అయితే కష్టమే. కానీ చిత్ర బృందం మాత్రం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికే దించాలని ప్రయత్నిస్తుంది. దిల్ రాజు (Dil Raju) అయితే ఈ విషయంలో బాగా ప్రెజర్ ఫీలవుతున్నారట. ఆయన 50 వ సినిమా ‘గేమ్ ఛేంజర్’ ఎప్పటికి రిలీజ్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ‘ఫ్యామిలీ స్టార్’ ని అయినా రెడీ చేసి రిలీజ్ చేద్దామా అంటే.. ఇలాంటి సమస్య ఒకటి వచ్చి పడింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus