వేసవికాలంలో చెప్పులు లేకుండా పది నిమిషాలు ఎండలో నడవాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (N. T. Ramarao (Jr NTR)) అభిమాని కోసం తారక్ పై అభిమానంతో ఏకంగా 300 కిలోమీటర్లు చెప్పుల్లేకుండా పాదయాత్ర చేసి వార్తల్లో నిలిచారు. చివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిసి తారక్ తో ఫోటో దిగారు. తారక్ ను చూడటానికి ఇంత కష్టపడిన ఆ అభిమాని గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఖమ్మం జిల్లాలోని గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు అనే అభిమాని ఖమ్మం నుంచి హైదరాబాద్ కు 300 కిలోమీటర్ల పాటు చెప్పులు లేకుండా పాదయాత్ర చేశారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేసిన ఈ అభిమాని చివరకు ఎన్టీఆర్ ఇంటి దగ్గరకు చేరుకోగా తారక్ ముంబైలో ఉన్నాడని తెలిసింది. అయినప్పటికీ రెండు వారాల పాటు ఎదురుచూసి తారక్ ను కలిసి తారక్ తో ఫోటో ఉంటారు.
ఇంతలా అభిమానించే అభిమానులు ఉండటం తారక్ అదృష్టమని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చివరకు తారక్ ను కలిసి ఫోటో దిగడంతో ఫ్యాన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు దేవర ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఫియర్ సాంగ్ అంచనాలను మించి సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అనిరుధ్ (Anirudh Ravichander) మ్యూజిక్, బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర (Devara) కాన్సెప్ట్ కూడా సరికొత్తగా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ తో ముగియనుందని తెలుస్తోంది. దేవర 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.