టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎలాంటి రోల్ లో నటించినా అద్భుతంగా నటిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో తారక్ విభిన్నమైన పాత్రలలో నటిస్తూ వేర్వేరు జానర్లను ఎంచుకుంటున్నా మైథలాజికల్ పాత్రలలో తారక్ నటించడం లేదు. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం ఆ తరహా కాన్సెప్ట్ లతో తెరకెక్కడం లేదనే సంగతి తెలిసిందే. పౌరాణిక పాత్రలను అలవోకగా పోషించగలనని ఆ పాత్రలలో అద్భుతంగా నటించగలనని తారక్ యమదొంగ (Yamadonga) సినిమాతో ప్రూవ్ చేశారు.
మరి తారక్ మనస్సులో ఏముందో అలాంటి పాత్రలకు ఎప్పుడు ఓకే చెబుతారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కి కథనం అద్భుతంగా ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ జనరేషన్ లో పౌరాణిక పాత్రలకు ఫస్ట్ ఆప్షన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలుస్తారని చాలామంది భావిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ కు ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస సినిమాలలో నటిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వేగంగా సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తుండటం కొసమెరుపు.
తారక్ తీపికబురు ఎప్పుడు చెబుతారో అంటూ కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నార్త్ బెల్ట్ లో సైతం తర్వాత సినిమాలతో మార్కెట్ ను మరింత పెంచుకుంటానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ నమ్ముతున్నారు. త్వరలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న తారక్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొత్త సినిమాల గుట్టు విప్పుతారేమో చూడాలి. యంగ్ డైరెక్టర్లకు తారక్ ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.