Krishna, Mahesh Babu: కృష్ణ, మహేష్ బాబు వీడియో చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్, ఆడియన్స్..!

సూపర్ స్టార్ కృష్ణ నుండి నట వారసత్వంతో పాటు కుటుంబ బాధ్యతల్ని కూడా తీసుకునే టైం వచ్చింది మహేష్ బాబుకి.. నటుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని.. ప్రిన్స్, సూపర్ స్టార్‌గా ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నాడు మహేష్.. ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్‌లో అమ్మ ఇందిరా దేవి, నవంబర్‌లో నాన్న.. ఇలా ముగ్గుర్ని కోల్పోవడంతో తను తీవ్ర విషాదంలో మునిగిపోయాడు..సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం అందర్నీ షాక్‌కి గురిచేసింది..

ఇప్పటికీ ఈ విషయాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.. అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కృష్ణ గారి వీరాభిమానులు, సీనియర్ ఫ్యాన్స్ అయితే గుండెలవిసేలా రోదించడం చూసి అంతా భావోద్వేగానికి గురయ్యారు. గతకొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా కృష్ణ గారి సినీ, జీవిత విశేషాలకు సంబంధించిన వార్తలే.. అవి చూసి ఈతరం వారు కృష్ణ గారు అంత గొప్ప వ్యక్తా? అంటూ ఆశ్చర్యపోతున్నారు..ఆయన సినిమాలు, సినిమా కోసం చేసిన సేవలు, సాహసాలు, నెలకొల్పిన రికార్డులు మరెవరికీ, ఎప్పటికీ సాధ్యం కానివి..

ఈ సందర్బంగా కృష్ణ గారి మీద ప్రేమాభిమానాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో తండ్రీకొడుకులను చూసి ప్రేక్షకాభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. కృష్ణ గారు, మహేష్ బాబు సినిమాల్లోని కొన్ని షాట్స్, సాంగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నిటినీ మ్యాచ్ చేస్తూ.. సింక్ అయ్యేలా చేసిన 2:20 నిమిషాల నిడవిగల వీడియో చాలా బాగుంది.. కృష్ణ గారివి 350 సినిమాలు.. మహేష్ బాబు 27 చిత్రాలు చేశారు..

అలాంటిది వీళ్ల సినిమాల్లో సరిగ్గా సరిపోయే సందర్భాలను వెతికిపట్టుకోవడం అంటే కష్టమే.. అయినా కానీ వారి మీద అభిమానంతో అద్భుతంగా ఎడిట్ చేశారు ఫ్యాన్స్.. అల్లూరి సీతారామ రాజు, కృష్ణుడు, ఆర్మీ, లారీ డ్రైవర్, పోలీస్.. ఇలా ప్రతీ షాట్, గెటప్ కూడా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా రూపొందించారు. సోషల్ మీడియాతో పాటు ఫ్యాన్ పేజీల్లో కూడా బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతున్నారు..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus