Trivikram: ఫ్యాన్స్ కోరికను త్రివిక్రమ్ నెరవేరుస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా గుర్తింపును సంపాదించుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారు. జులై మొదటివారంలో మహేష్ కు త్రివిక్రమ్ ఫైనల్ నేరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుండగా ఆ సమయానికి ఈ సినిమా విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

2023 సంక్రాంతికి ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. జులైలో మొదలుపెట్టి డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం సులువు కాదు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ అంటే షూటింగ్ కు కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు ప్రభాస్, చరణ్ లతో త్రివిక్రమ్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరి ఈ కాంబినేషన్లలో సినిమాలు ఎప్పటికి సాధ్యమవుతాయో చూడాల్సి ఉంది. చరణ్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి మాత్రం ఎక్కువగా వార్తలు ప్రచారంలోకి రాలేదు. ప్రభాస్, చరణ్ అభిమానులు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా తమ ఫేవరెట్ హీరోలు నటించాలని కోరుకుంటున్నారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. సినిమాసినిమాకు త్రివిక్రమ్ కు పాపులారిటీ పెరుగుతోంది. త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus