‘అకీరా నా కొడుకు. మీరు ఇకనైనా మాట్లాడే పద్ధతి నేర్చుకోండి’ అంటూ రేణు దేశాయ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఎందుకు ఇంతగా స్పందించారు. అసలు ఏమైంది, అంతగా ఆమెను నెటిజన్లు ఇబ్బంది పెట్టారా? అంటూ చర్చ మొదలైంది. కొడుకు పుట్టిన రోజు నాడు ఇలా తల్లి మనసును గాయపరచాలా అని అనుకుంటున్నారు. అయితే ఆమె ఈ పోస్ట్‌లో రాసుకొచ్చిన కొన్ని అంశాలను చూసి.. ఏంటి ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు అని అంటున్నారు. .
పవన్ కల్యాణ్ – రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ రేణు ఇన్‌స్టాలో శనివారం ఓ వీడియో షేర్ చేశారు. ఆ పోస్టుకు నెటిజన్లు లైక్‌లు, కామెంట్లతో వైరల్ చేశారు. అయితే అందులో ఒక నెటిజన్ ‘‘మేడమ్.. ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న తనయుడిని చూడాలని ఆశగా ఉంటుంది’’ అని కామెంట్ చేశాడు. దానికి రేణు ‘‘మీ అన్న తనయుడా? అకీరా నా అబ్బాయి. మీరు వీరాభిమానాలు కావొచ్చు. కానీ ఎలా పద్ధతి మాట్లాడాలో నేర్చుకోండి’’ అని రియాక్ట్ అయ్యారు.
గత కొన్నేళ్లుగా ఇలాంటి మెసేజ్‌లు, కామెంట్లు చూసి ప్రతిసారీ పట్టించుకోకుండా వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు కొంతమంది మరీ ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు ఇక ఆగేది లేదు అంటూ.. కాస్త కటువుగా అన్నారు. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘మేడమ్ మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో మాటల్లో… నువ్వు ఎవరి బిడ్డవి అని అడిగితే తండ్రి పేరే చెబుతారు.
ఇది మా సంస్కృతి. అందుకే అలా అంటుంటాం. కాబట్టి అభిమానులపై ఇలా ఊరికనే ఆగ్రహం వ్యక్తం చేయొద్దు’’ అని కామెంట్ చేశాడు. ఇలాగే మరికొంతమంది కామెంట్స్ కనిపిస్తున్నాయి. నెటిజన్ల కామెంట్స్ విషయంలో కోపం రావడం తప్పులేదు కానీ. ‘మా అన్నయ్య కొడుకును చూపించండి’ అంటే తప్పేముంది అని అంటున్నారు.